Asianet News TeluguAsianet News Telugu

ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తాం.. ఆ బాధ్యత రేవంత్‌ రెడ్డిదే: మాణిక్‌రావ్ ఠాక్రే

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మాణిక్‌రావ్ ఠాక్రే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలతో సమావేశమైన మాణిక్ రావ్ ఠాక్రే.. ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 

manik rao thakre key comments in TPCC Meeting
Author
First Published Jan 21, 2023, 4:34 PM IST

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన మాణిక్‌రావ్ ఠాక్రే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలతో సమావేశమైన మాణిక్ రావ్ ఠాక్రే.. ఈరోజు టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో పరాయి భావన వద్దని కూడా ఆయన పార్టీ నేతలకు స్పష్టం చేశారు. ఇంకా కొట్టుకుంటూ ఉంటే ఎన్నికలకు ఎప్పుడు వెళ్తారని పార్టీ నేతలను సూటిగా ప్రశ్నించారు. సీనియర్ నేతలు ఏకతాటిపైకి వచ్చిన పనిచేయాలని చెప్పారు. పార్టీలో అందరిని కలుపుకోవాల్సిన బాధ్యత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిదేనని అన్నారు. 

హాత్‌ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రేవంత్ రెడ్డి 50 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తారని.. సీనియర్లు కూడా 30 నియోజకర్గాల్లో పాదయాత్రలు చేయాలని మాణిక్‌రావ్ ఠాక్రే చెప్పినట్టుగా తెలుస్తోంది. తాను ఎవరికి వ్యతిరేకం కాదు.. ఎవరికి అనుకూలం కాదని చెప్పారు. అధిష్టానం చెప్పింది చేయడమే తన విధి అని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడొద్దని చెప్పారు. పార్టీకి నష్టం చేకూర్చేలా ఎవరూ మాట్లాడొద్దని అన్నారు. ఏదైనా ఉంటే తనతో మాట్లాడాలని.. తాను ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇక, రాష్ట్రంలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

ఇదిలా ఉంటే.. టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విషయాన్ని ప్రస్తావించారు. పార్టీకి నష్టం చేకూర్చేలా చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్  చేయాలని కోరినట్టుగా తెలుస్తోంది. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించిన చర్యలు తీసుకోకపోవడం లేదని అన్నారు.  అందరం కలిసి పనిచేయలేకే ఎన్నికల్లో ఓడిపోయామని అన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి పనిచేయాలని పార్టీ శ్రేణులను కోరారు.

అయితే సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ఈ సమావేశంలో వ్యక్తిగత  అంశాలు మాట్లాడొద్దని సూచించారు. సమావేశ అజెండా మీదే ఇక్కడ మాట్లాడాలని కోరారు. వ్యక్తిగత అంశాలు, డిమాండ్లు, ఏదైనా ఫిర్యాదులు ఉంటే.. పార్టీ ఇంచార్జ్‌ను కలిసి చెప్పొచ్చని అన్నారు. ఈ సమావేశం అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటే ఇతరులకు భయం ఉంటుందని చెప్పినట్టుగా తెలిపారు. రేవంత్ పాదయాత్ర చేస్తే పార్టీకి లాభం చేకూరుతుందని అన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios