సంగారెడ్డి: తెలంగాణ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జగ్గారెడ్డికి మంత్రిపదవి వస్తోందని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు.

శుక్రవారంనాడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణికం ఠాగూర్ పాల్గొన్నారు.

also read:ఏ ముఖం పెట్టుకొని దుబ్బాకలో ఓట్లు అడుగుతారు: సంగారెడ్డి సభలో టీఆర్ఎస్‌పై ఉత్తమ్ విమర్శలు

ఈ సందర్భంగా ఆయన జగ్గారెడ్డికి మంత్రి పదవిపై హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీలో ఎవరూ సీఎం అయినా కూడ జగ్గారెడ్డికి మంత్రి పదవి దక్కుతోందని ఆయన తేల్చ చెప్పారు. 

మంత్రి పదవిపై ఠాగూర్ ప్రకటన చేయడంతో జగ్గారెడ్డి వర్గీయుల్లో హర్షాతికేరాలు వ్యక్తమయ్యాయి. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో జగ్గారెడ్డి  చీప్ విప్ గా కొనసాగాడు. మంత్రి పదవి మాత్రం ఆయనకు దక్కలేదు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ఉన్నాడు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో తెలంగాణకు చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన నేత దామోదర రాజనర్సింహకు కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది.

కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో జగ్గారెడ్డికి మంత్రి పదవి వస్తోందని ఠాగూర్ చేసిన ప్రకటన కాంగ్రెస్ వర్గాల్లో కొంత కలకలానికి కారణమైంది.దీంతో జగ్గారెడ్డి జోక్యం చేసుకొన్నారు. పస్ట్ దామోదర రాజనర్సింహకే... చివరికే తనకు మంత్రి పదవి వస్తోందని ఆయన వివరణ ఇచ్చారు.