హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. కేసీఆర్ కు కులవివక్ష నేటికి ఉందని ఆరోపించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద అంబేద్కర్ వాదుల నిర్వహించిన మహాగర్జన నిరసన సభలో పాల్గొన్న ఆయన దళిత వర్గాలను కేసీఆర్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. 

దళితుల ఆరాధ్యదైవం అయిన అంబేద్కర్‌ను టీఆర్ఎస్ సర్కార్ అవమానించిందంటూ మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ అన్ని పార్టీల్లోని అంబేద్కర్ వాదులను సమీకరిస్తానని స్పష్టం చేశారు. 

ఎలాంటి ఆరోపణలు లేకపోయినా మంత్రివర్గం నుంచి రాజయ్యను బర్తరఫ్ చేసిన కేసీఆర్ విద్యాశాఖలో అవకతవకలకు పాల్పడ్డ జగదీష్ రెడ్డిపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. 

ఇది కుల వివక్ష కాదా కేసీఆర్ అంటూ ప్రశ్నించారు. అంబేద్కర్ విగ్రహం పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై గవర్నర్ , జాతీయ ఎస్సీ ఎష్టీ కమిషన్ ను కలుస్తానని ఫిర్యాదు చేస్తానని మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు.