19 సీట్లలో కనీసం 14 సీట్లు మాదిగలకు ఇవ్వాలి: మందకృష్ణ మాదిగ డిమాండ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్ 19 స్థానాల్లో 14 సీట్లకు తగ్గకుండా మాదిగలకు కేటాయించాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. చెన్నూరులో మాదిగలకే టికెట్ ఇవ్వాలని అన్నారు. మాదిగలకు టికెట్ ఇవ్వని పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ పై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు 19 ఎస్సీ రిజర్వు స్థానాల్లో 14 సీట్లకు తగ్గకుండా మాదిగలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. మందకృష్ణ మాదిగ శనివారం మంచిర్యాలో పర్యటించారు.
ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీలు తమ వైఖరి వెల్లడించాలని మందకృష్ణ డిమాండ్ చేశారు. ఈ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని, ఆ బిల్లుకు రాజకీయ పార్టీలు అన్నీ మద్దతు తెలుపాలని కోరారు. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకునే పార్టీకే మాదిగల మద్దతు ఉంటుందని అన్నారు. లేదంటే.. మాదిగ పల్లెల్లోకి వచ్చే పార్టీలన్నింటనీ ఎండగడతామని వార్నింగ్ ఇచ్చారు. నవంబర్ 30వ తేదీ లోపు రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణపై తమ వైఖరిని తేల్చాలని స్పష్టం చేశారు.
Also Read: వేశ్యలను సప్లై చేస్తామని వెబ్‌సైట్.. 80 మంది నుంచి రూ. 5 కోట్లు వసూల్.. ఆ ముఠా ఎలా మోసం చేస్తుందంటే?
కేసీఆర్ మాదిగలకు సముచిత స్థానం కల్పించడం లేదని, మాదిగలకు అన్యాయం చేశాడని మందకృష్ణ ఫైర్ అయ్యారు. ఇందుకు నల్లాల ఓదేలు, డాక్టర్ రాజయ్యలే ఉదాహరణలు అని వివరించారు.చెన్నూరులో మాదిగలకే టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చెన్నూరులో మాదిగలకు టికెట్ ఇవ్వని పార్టీలకు తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. మాదిగలకు అన్యాయం చేసిన పార్టీలకు మాదిగ పల్లెల్లోకి రాకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అస్తిత్వ సంఘాలు తమ వాణిని బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.