Asianet News TeluguAsianet News Telugu

తన మనుషులకే రుణం ఇప్పించి...సొంత ‌బ్యాంక్‌కే కన్నం వేసిన మేనేజర్‌

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం గురించి మనం పెద్దలు చెబుతుంటే విన్నాం.. ఇక్కడ ఓ బ్యాంక్ మేనేజర్ దానిని ఆచరించి.. కటకటాల పాలయ్యాడు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ బ్రాంచ్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ రామచంద్రుని హనుమంతరావు

manager arrest against wrong full loss to the Andhra Bank
Author
Hyderabad, First Published Nov 6, 2018, 11:49 AM IST

తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం గురించి మనం పెద్దలు చెబుతుంటే విన్నాం.. ఇక్కడ ఓ బ్యాంక్ మేనేజర్ దానిని ఆచరించి.. కటకటాల పాలయ్యాడు. తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ బ్రాంచ్ ఆంధ్రాబ్యాంక్ మేనేజర్ రామచంద్రుని హనుమంతరావు...

2016 సమయంలో హైదరాబాద్ మధురానగర్ ఆంధ్రా బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలని భావించాడు. ఇందుకు గాను తాను పనిచేస్తున్న బ్యాంక్‌నే మోసం చేయాలని నిర్ణయించాడు..

దీనిలో భాగంగా పథకం ప్రకారం తన మనుషులైన పాశం ప్రశాంత్, కోలపల్లి నవీన్‌కుమార్, శ్రీనివాస పూజారితో పాటు మరికొందరికి ఫ్లాట్ల కొనుగోలు నిమిత్తం హౌసింగ్ లోన్ కింద దరఖాస్తు చేయించాడు. అనంతరం రుణం మంజూరు చేసి.. రూ.1.37 కోట్లు పే ఆర్డర్ రూపంలో అడ్వాన్స్‌గా ఇచ్చాడు. రిజిస్ట్రేషన్ సమయంలో ఫ్లాట్ ఓనర్లకు చెల్లించాల్సిన సొమ్మును ఆ ముగ్గురికి అందజేశాడు.

డబ్బు తీసుకున్న నిందితులు బ్యాంకుకు వాయిదాలు కట్టడం లేదు. బ్యాంక్‌లో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు గాను స్వయంగా 2016 మార్చి 22న సీసీఎస్‌లో ఫిర్యాదు చేశాడు హనమంతరావు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రుణం తీసుకున్న వారిని విచారించగా... బ్యాంకు మేనేజర్ హనుమంతరావే సూత్రధారి అని తేలడంతో.. తిరుపతిలో ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios