మంచిర్యాలలో ఇంటి చుట్టూ చేరిన వరద నీరు: కాపాడాలని ఓ వ్యక్తి ఆర్తనాదాలు
మంంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ఇంటి చుట్టూ వరద నీరు చేరింది.ఈ ఇంటిలో ఓ వ్యక్తి తలదాచుకున్నాడు. తనను కాపాడాలని ఆ వ్యక్తి ఆర్తనాదాలు చేశాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.
మంచిర్యాల: Mancherialజిల్లా కేంద్రంలోని ఓ ఇంటి చుట్టూ Flood నీరు చేరింది. దీంతో తనను కాపాడాలని ఆ వ్యక్తి కోరుతున్నాడు. Heavy Rains తో మంచిర్యాల జిల్లాలో వరద నీరు చేరింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపానికి సమీపంలోని ఇంట్లో ఆ వ్యక్తి చిక్కుకున్నాడు. బాధితుడు ఉన్న నివాసం సగం మేర వదర నీటిలో మునిగింది. వరద ప్రభావం పెరిగితే బాధితుడు ఉంటున్న నివాసం పూర్తిగా మునిగే అవకాశం ఉంది. Godavari కి వరద పోటెత్తడంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో వరద నీరు పోటెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది., గోదావరితో పాటు దాని ఉప నదులు పోటెత్తుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తోంది. ఈ ప్రాజెక్టుకు ఒక్క గేటు తెరుచుకోవడం లేదు. ఈ ప్రాజెక్టుకు 5 లక్షల క్యూసెక్కల నీరు వస్తుంంది. అయితే రెండు లక్షల క్యూసెక్కుల నీటిని 17 గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టు దిగువన ఉన్న 25 గ్రామాల ప్రజలను అధికారులు అలెర్ట్ చేశారు. ఈ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
also read:దేవాదుల ప్యాకేజీ 3లోకి చేరిన గోదావరి వరద నీరు: నిలిచిన ప్రాజెక్టు పనులు
గోదావరికి వంద ఏళ్లలో రాని రికార్డు వరద ఈ సమయంలో వచ్చింది. సాధారణంగా గోదావరి నదికి సెప్టెంబర్, ఆగష్టు మాసాల్లో వరద వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం జూలై మాసంలోనే వరద వచ్చింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా కురిసిన భారీ వర్షాలు కూడా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.