హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి తల్లిదండ్రులను చంపుతానని మైనర్ బాలికను ఓ యువకుడు బెదిరించాడు. నగరంలోని బంజారాహిల్స్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

హైదరాబాద్ లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. తనను పెళ్లి చేసుకోకపోతే అమ్మాయి తల్లిదండ్రులను చంపుతానని మైనర్ బాలికను ఓ యువకుడు బెదిరించాడు. నగరంలోని బంజారాహిల్స్ లో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. 

వివరాల్లోకి వెడితే.. గత కొన్ని రోజుల క్రితం మైనర్ బాలికకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. తరువాత స్నేహితుడిగా మారాడు. ఈ క్రమంలో స్నేహం ముసుగులో ప్రేమ పేరుతో ఆ బాలికను మోసం చేశాడు. అంతేకాకుండా తనను పెళ్లి చేసుకోవాలని వేధించడం మొదలుపెట్టాడు. 

యువకుడి వేధింపులు భరించలేక యువతి మనోవేదనకు గురై ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బంజారాహిల్స్ లో ఆలస్యంగా సోమవారం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యువకుడి కోసం గాలిస్తున్నారు.