Asianet News TeluguAsianet News Telugu

బెట్టింగ్ ల కోసం బరి తెగించాడు.. స్నేహితురాలితో కలిసి అక్క ఇంట్లోనే చోరీ...

ఈ నేపథ్యంలోనే తల్లి చికిత్స నిమిత్తం డబ్బు అవసరమని స్నేహితురాలిని నమ్మించాడు.  జ్యోతి ఇంటి పక్కనే ఉండే ఆమె సోదరి  విజయ,  తల్లి అనసూయతో కలిసి పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి వెళ్లారు.  ఇదే అదనుగా రాజు, జ్యోతి కలిసి వారి ఇంటి తాళం పగలకొట్టి బీరువా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగిలించారు.  

man theft jewellery with the help of his childhood friend over betting in hyderabad
Author
Hyderabad, First Published Sep 15, 2021, 9:33 AM IST

బెట్టింగ్ లకు అలవాటుపడి చిన్ననాటి స్నేహితులతో కలిసి ఆమె సోదరి ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన ఇది. జూబ్లీహిల్స్ ఠాణా డీఐ ఆకుల రమేష్, డిఎస్ఐ  హరీశ్వర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..  మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలానికి చెందిన చింత రాజు కార్మిక నగర్ లో నివసిస్తున్నాడు. అదే కాలనీలో ఆయనతో చిన్నప్పుడు కలిసి చదువుకున్న జ్యోతి ఉంటుంది.
రెండు కుటుంబాల మధ్య స్నేహం వుంది.  

ప్రైవేట్ మెడికల్ సంస్థలో పనిచేస్తున్న రాజు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ లకు అలవాటు పడ్డాడు.  జీతంతో పాటు అప్పులు చేసి మరీ బెట్టింగ్ లకు ఖర్చు చేసేవాడు.  ఆయన తల్లికి కిడ్నీ సంబంధిత సమస్య ఉండడంతో డయాలిసిస్ చేయించాల్సి వచ్చేది. 

జిత్తన్నా ఏం చేస్తున్నావ్.. టీఆర్ఎస్ సీనియర్ నేతతో కేసీఆర్

ఈ నేపథ్యంలోనే తల్లి చికిత్స నిమిత్తం డబ్బు అవసరమని స్నేహితురాలిని నమ్మించాడు.  జ్యోతి ఇంటి పక్కనే ఉండే ఆమె సోదరి  విజయ,  తల్లి అనసూయతో కలిసి పశ్చిమగోదావరి జిల్లా తణుకు ప్రాంతానికి వెళ్లారు.  ఇదే అదనుగా రాజు, జ్యోతి కలిసి వారి ఇంటి తాళం పగలకొట్టి బీరువా తాళాలు తీసి బంగారు ఆభరణాలు దొంగిలించారు.  

వాటిని రాజు తనఖా పెట్టి  సుమారు నాలుగు లక్షల అప్పు తీసుకున్నాడు. బెట్టింగ్ లలో  ఆ డబ్బు  పోగొట్టుకున్నాడు. వారం క్రితం తిరిగి వచ్చిన విజయ ఇంట్లో చోరీ జరిగిందని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టి నిందితులను గుర్తించారు పోలీసులు.  రాజు ను అరెస్ట్ చేసి 25 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.  జ్యోతి పరారీలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios