భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తుందనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ హెచ్ వో సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన కిన్నెర జాంబవంతుడు (32) రామనర్సయ్యనగర్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని నాలుగేళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు. 

ఖమ్మం : ఇదో రివర్స్ కేసు.. భర్త, అత్తింటి వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకోవడం మామూలుగా, అనాదిగా చూస్తున్న విషయాలు. భర్త వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుని భార్యను వేధించడం... అది తట్టుకోలేక భార్య బలవన్మరణానికి ఒడిగట్టడం వింటుంటాం. అయితే ఖమ్మం జిల్లాలో దీనికి విరుద్ధమైన ఘటన జరిగింది.

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా వేధిస్తుందనే కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎస్ హెచ్ వో సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా కొణిజర్లకు చెందిన కిన్నెర జాంబవంతుడు (32) రామనర్సయ్యనగర్ కు చెందిన మహిళను పెళ్లి చేసుకుని నాలుగేళ్ల నుంచి అక్కడే ఉంటున్నాడు. 

ఈ నేపథ్యంలో భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం సాగిస్తూ జాంబవంతుడితో నిత్యం గొడవపడేది. దీంతో మనస్తాపానికి గురైన అతడు ఆదివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి ఓ కూతురు ఉంది. జాంబవంతుడు తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం తరలించారు.