తన కొడుకును అకారణంగా అరెస్ట్ చేశారనే కారణంగా నిజామాబాద్ జిల్లా మక్లూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు.బాధితుడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు.
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా మక్లూరు పోలీస్ స్టేషన్ ముందు ఓ వ్యక్తి పురుగుల మందు తాగి శుక్రవారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.తన కొడుకును పోలీసులు అకారణంగా అదుపులోకి తీసుకొన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన కొడుకును విడిచిపెట్టాలని కోరుతూ ఆయన పోలీస్ స్టేషన్ ముందే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతడిని గుర్తించి ఆసుపత్రికి తరలించారు.
