వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం నేరేళ్లలో దారుణం చో టు చేసుకొంది.భార్య గొంతు కోసిన భర్త తాను  ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

సోమవారం నాడు ఉదయం పూట భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆగ్రహం పట్టలేక భర్త భార్య గొంతు కోశాడు. ఆ తర్వాత తాను కూడ కత్తితో పొడుచుకొని ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఈ ఘటనలో భార్య అక్కడికక్కడే మృతి చెందింది.  భర్త పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.