మూడు నెలలుగా అమ్మాయిపై కీచకుడి అత్యాచారం

Man sexually assaults a girl for 3 months
Highlights

తెలంగాణలోని హన్మకొండలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఓ 11 ఏళ్ల బాలికపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. చంపుతానని బెదిరించి, తల్లి లేని సమయంలో అతను అత్యాచారం చేస్తూ వచ్చాడు.

వరంగల్: తెలంగాణలోని హన్మకొండలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఓ 11 ఏళ్ల బాలికపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. చంపుతానని బెదిరించి, తల్లి లేని సమయంలో అతను అత్యాచారం చేస్తూ వచ్చాడు. సుబేదారి సిఐ పి. సదయ్య అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించార. 

హన్మకొండలోని తిరుమల బార్‌ సమీపంలో ఓ మహిళ తన కూతురితో కలిసి నివాసం ఉంటూ వస్తోంది. ఆమె భర్తకు దూరంగా ఉంటూ కూరగాయలు అమ్ముతూ జీవిస్తోంది.. ఆ కుంటుంబానికి ఐలయ్య (27) అనే వ్యక్తి దగ్గరయ్యాడు. అతను కూడా కూరగాయలు అమ్ముతూ జీవనం గడుపుతున్నాడు. 

కుటుంబానికి అండదండలు అదిస్తున్నట్లు నటిస్తూ 7వ తరగతి చదువుతున్న బాలికపై  కన్నేశాడు. తల్లి లేని సమయంలో ఐలయ్య ఇంట్లోకి వెళ్ళి బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడుతూ వచ్చాడు.
 
ఓ రోజు రాత్రి వేళ బాలికను ఐలయ్య వ్యక్తి పక్కకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నం చేసినట్లు తెలిసింది. ఇది గమనించిన బాలిక తల్లి ఐలయ్యను నిలదీసింది. ఈ విషయం చెప్తే ఇద్దరిని చంపేస్తానని బెదిరించాడు. 

అతను వెళ్లిపోయిన తర్వాత తల్లి బాలికను ప్రశ్నించింది. దీంతో ఆమె తల్లికి అసలు విషయం చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు నిందితునిపై గురువారం పోలీసులు నిర్భయ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

loader