భార్యపై కోపంతో ఓ వ్యక్తి సొంత ఇంటికే నిప్పు పెట్టాడు. ఈ దారుణ సంఘటన కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో చోటుచేసుకుంది.
కాగా.. భార్య, బిడ్డలు సురక్షితంగా బయటపడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళితే... జంగాం గ్రామానికి చెందిన కుమ్ర నారయణ ,యమునాభాయ్ దంపతులకు ముగ్గురు సంతానం.నారయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతున్న క్రమంలో భార్య, భర్తల మధ్య గొడవ నెలకొంది.
ఈ క్రమంలో ఇంట్లో పిల్లలు ఉన్నారన్న విషయం కూడా మర్చిపోయి.. సొంత ఇంటికే నిప్పు పెట్టాడు.

అనంతరం అక్కడ నుండి పారిపోయాడు.అయితే ఈ మంటలకు ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ సైతం పేలింది.  వెంటనే తేరుకున్న గ్రామస్థులు ఇంటికి విద్యుత్ సరఫరా ను నిలిపి వేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేస్తున్నారు.