హైదరాబాద్: ప్రియురాలిని కలిసేందుకు వెళ్లి పాక్ లో పట్టుబడిన ప్రశాంత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాలుగేళ్ల తర్వాత హైద్రాబాద్ కు తిరిగి వచ్చాడు. తన్ ప్రియురాలు స్విట్జర్లాండ్ లో ఉన్న విషయాన్ని తెలుసుకొన్న ప్రశాంత్ పాకిస్తాన్ మీదుగా స్విట్జర్లాండ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా పాక్ అధికారులు ఆయనను పట్టుకొన్నారు. బాధిత కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ను కలిశారు. దీంతో సజ్జనార్ పాక్ లో ఉన్న ఎంబసీ అధికారులకు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. 

2017 నుండి ప్రశాంత్ పాకిస్తాన్ జైల్లో ఉన్నాడు. ప్రశాంత్ తండ్రి బాబురావు సజ్జనార్ ను కలిశారు. తన కొడుకు విషయాన్ని చెప్పాడు. పాకిస్తాన్ అధికారులతో పాటు దౌత్యాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ప్రశాంత్ ఇంటికి వచ్చేలా పోలీసులుప్రయత్నించారు. సజ్జనార్ కృషి మేరకు ప్రశాంత్  హైద్రాబాద్ కు  చేరుకొన్నాడు. 

ప్రశాంత్ పాక్ లో పట్టుబడిిన తర్వాత విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసిన తర్వాతే  ప్రశాంత్ పాకిస్తాన్ లో ఉన్నాడని తమకు తెలిసిందని  పేరేంట్స్ చెప్పారు. తమ కొడుకును రక్షించాలని ప్రశాంత్ తల్లిదండ్రులు విదేశాంగ శాఖ అధికారులను కూడ కలిశారు.