14 ఏళ్ల చిన్నారిపై 40 ఏళ్ల కామాంధుడు అత్యాచారం

Man rapes 14-year-old girl in Hyderabad.
Highlights

హైదరాబాద్  మెట్టగూడలో దారుణం

మహిళలు, చిన్నారులపై కామాంధులు ఆగడాలు హైదరాబాద్ లో మరీ ఎక్కువచ్చాయి.  లైంగిక దాడులకు దిగుతున్న నిందితులపై పోలీసులు కఠినంగావ్యవహరిస్తున్నా, మహిళల రక్షణ కోసం షీ టీమ్ లు పనిచేస్తున్నా కామాంధులు మాత్రం రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా సికింద్రాబాద్ సమీపంలోని మెట్టగూడలో ఓ 14 ఏళ్ల చిన్నారి అత్యాచార ఘటన వెలుగు చూసింది.

ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...మెట్టగూడ ఆలుగడ్డబావి లో ఓ 14 ఏళ్ల చిన్నారి కుటుంబంతో కలిసి నివసిస్తోంది. వారు ఉండే ఇంటి పై అంతస్తులో మాణిక్యం(40) అనే వ్యక్తి అద్దెకుంటున్నాడు. అయితే అతడు తల్లిదండ్రులు లేనపుడు ఇంట్లో ఒంటరిగా ఉండే ఆ చిన్నారిపై కన్నేశాడు.

ఇంట్లో చిన్నారి తల్లిదండ్రలు లేనపుడు తన గదిలోకి తీసుకుపోయి బలవంతంగా అత్యాచారం చేసేవాడు. ఈ దారుణం గత కొన్ని రోజులుగా సాగుతున్నా చిన్నారిని బెదిరించడంతో బైటపెట్టలేదు. ఎవరికైనా చెబితే అత్యాచారం చేస్తుండగా తీసిన వీడియోలు యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తానని బాలికను బయపెట్టేవాడు.

అయితే అతడు ఇలా ప్రతిరోజు బెదిరించి అత్యాచారానికి పాల్పడటంతో బెదిరిపోయిన బాలిక ఈ విషయాన్ని తన అమ్మమ్మ కు చెప్పింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి వారితోకలిసి చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాణిక్యంను అదుపులోకి తీసుకొని అతనిపై పోస్కో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.  
 

loader