తోడబుట్టిన అక్క కాపురం చక్కబెట్టాలని అనుకున్నాడు. అక్క, బావల మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించే ప్రయత్నం చేయాలని అనుకున్నాడు. కానీ తాను చేయాలనుకున్న మంచిని బావ అర్థం చేసుకోలేకపోయాడు. పాత గొడవలను మనసులో పెట్టుకొని బావమరిదిని అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... పట్టణంలోని ఖుర్షీద్ నగర్ కాలనీలో ఓసావార్ సంతోష్- మమత దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ స్థానికంగా ఓ జిన్నింగ్ మిల్లులో కూలీ పనులు చేస్తున్నాడు. 14 సంవత్సరాల క్రితం వీరిద్దరి వివాహం జరగగా.. ఇద్దరు సంతానం ఉన్నారు. వివాహం జరిగిన కొన్ని రోజుల నుంచి భార్యభర్తలిద్దరికీ మనస్పర్థలు రావడంతో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ప్రతిరోజు గొడవలు జరుగుతండడంతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు, పెద్దలతో పంచాయితీలు జరిగేవి. దీంతో విసుగు చెందిన మమత గత సంవత్సరం క్రితం తన తల్లిదండ్రులు నర్సమ్మ, దత్తు, తన సోదరుడు మనోజ్ లు ఉండే మహారాష్ట్రలోని దేహెపల్లికి వెళ్లిపోయింది. పుట్టింటికి వెళ్లిపోిన భార్యతో తాను మారిపోయానంటూ నమ్మించే ప్రయత్నం చేశాడు.

కాగా.. అక్క, బావ మధ్య ఉన్న మనస్పర్థలు పొగొట్టేందుకు మనోజ్ తన వంతు ప్రయత్నం చేశాడు. బావమరిది అలా చెప్పడం సంతోష్ కి ఏ మాత్రం నచ్చలేదు. గురువారం పని నిమిత్తం తన స్నేహితుడు సంజీవ్ తో కలిసి మనోజ్ ఆదిలాబాద్ కి వచ్చాడు. అక్క, పిల్లలకు కొత్త బట్టలు తీసుకొని మనోజ్ సంతోషంగా తన బావ ఇంటికి వెళ్లాడు.

అప్పటికే మనోజ్ మీద కోపంతో ఉన్న సంతోష్.. మాయ మాటలు చెప్పి బయటకు తీసుకువెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. బావ నుంచి మనోజ్ తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు.  రోడ్డు మీద పరిగెత్తించి మరీ హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. కట్టుకున్న భర్త.. తన తోడపుట్టిన తమ్ముడిని చంపుతాడని ఊహించలేదని మమత కన్నీరు పెట్టుకుంది. ఇక తాను రాఖీ ఎవరికి కట్టాలని ఆమె ఏడుస్తుంటే.. స్థానికులను కూడా కదిలించింది. పోలీసులు పరారీలో ఉన్న సంతోష్ కోసం గాలిస్తున్నారు.