అదే గ్రామానికి చెందిన ఇరవై యేళ్ల యువకుడు ఇది గమనించాడు. ఆమెను బలవంతంగా సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి sexual assault కి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బైటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు.  

ఖమ్మం : అశ్వరావుపేటలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలిక మీద ఓ యువకుడు అత్యంత దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీన్ని మరో యువకుడు సెల్ ఫోన్ లో వీడియో చిత్రీకరించాడు. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

khanmmam district అశ్వరావుపేట ఎస్సై చల్లా అరుణ బుధవారం రాత్రి ఈ కేసు వివరాలు వెల్లడించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (15) గత నెల 30వ తేదీన చర్చికి వెళ్లింది. రాత్రి 10 గంటల సయమంలో తిరిగి ఒంటరిగా ఇంటికి బయలుదేరింది. 

అదే గ్రామానికి చెందిన ఇరవై యేళ్ల యువకుడు ఇది గమనించాడు. ఆమెను బలవంతంగా సమీపంలోని పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి sexual assault కి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బైటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డారు. 

కాగా, minor girl పై లైంగిక దాడికి పాల్పడుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన మరో యువకుడు తన సెల్ ఫోన్ లో video shoot చేశాడు. ఈ ఘటన మీద బాలిక తల్లిదండ్రులు బుధవారం రాత్రి లిఖిత పూర్వక ఫిర్యాదు చేశారు. దీంతో ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు యువకుల మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

భార్యతో అక్రమసంబంధం.. చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి, రాడ్ తో తలమీద బాది..

ఇదిలా ఉండగా, జూలూరుపాడులో నీటి తొట్టిలో పడి 13 నెలల బాలుడు మృతి చెందాడు. ఈ విషాద సంఘటన మండల పరిధిలోని పాపకొల్లు గ్రామ పంచాయతీ బీమ్లా తండాలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. భీమ్లా తండాకు చెందిన గుుగలోత్ శ్రీనివాసరావు, హరిత దంపతులకు ఇద్దరు సంతానం. 

పెద్ద కుమారుడు చేతన్ భార్గవ్, చిన్న కుమారుడు రిషిత్ నాయక్ (13 నెలలు) లను ఇంట్లో నాయనమ్మ దేవి దగ్గర ఉంచి తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లారు. నాయనమ్మ వద్ద ఉన్న రిషిత్ ఆడుకుంటూ వెళ్లి ఇంటి ప్రాంగణంలో ఉన్న నీటి తొట్టిలో పడిపోయాడు. 

ఇంటిపనిలో నిమగ్నమైన నాయనమ్మ దేవి, పెద్దమ్మ దుర్గ కొంతసేపటి తరువాత పిల్లవాడు కనిపించకపోవడంతో ఆందోళన చెందుతూ.. వెతకగా నీటి తొట్టిలో పడి ఉన్నాడు. బైటికి తీసి స్థానిక వైద్యుడి వద్దకు తీసుకుళ్లగా అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.