Asianet News TeluguAsianet News Telugu

నకిలీ జీపీఎస్‌తో ఆన్‌లైన్ లో రమ్మీ ఆడిన హైద్రాబాద్ వాసి: రూ. 70 లక్షల నష్టం

ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ. 70 లక్షలు పోగోట్టుకొన్నాడు ఓ యువకుడు. హైద్రాబాద్ లోని అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు రెండేళ్లుగా ఆన్ లైన్ లో రమ్మీ ఆడుతూ  డబ్బులు పోగోట్టుకొన్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 

man loses  RS .70 lakh in online rummy in Hyderabad lns
Author
Hyderabad, First Published Dec 9, 2020, 10:57 AM IST

హైదరాబాద్: ఆన్‌లైన్ రమ్మీ ఆడి రూ. 70 లక్షలు పోగోట్టుకొన్నాడు ఓ యువకుడు. హైద్రాబాద్ లోని అంబర్ పేటకు చెందిన ఓ యువకుడు రెండేళ్లుగా ఆన్ లైన్ లో రమ్మీ ఆడుతూ  డబ్బులు పోగోట్టుకొన్నట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తెలంగాణ రాష్ట్రంలో ఆన్ లైన్ లో రమ్మీ ఆటపై నిషేధం ఉంది. ఆన్ లైన్ లో రమ్మీపై నిషేధం ఉన్నప్పటికీ కూడ ఎలా ఓపెన్ అయిందని సైబర్ క్రైమ్ పోలీసులు బాధితుడిని ప్రశ్నించారు. 

ఫేక్ జీపీఎస్ ఆధారంగా ఆన్‌లైన్ రమ్మీని ఆడుతున్నట్టుగా బాధితుడు పోలీసులకు చెప్పారు. రెండేళ్లుగా తాను ఫేక్ జీపీఎస్  సహాయంతో ఆన్‌లైన్ రమ్మీ ఆడినట్టుగా ఆయన పోలీసులకు చెప్పాడు.అప్పులు చేసి రమ్మీ ఆడి రూ. 70 లక్షలు  కోల్పోయాయనని బాధితుడు చెప్పాడు.  బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

2017లోనే తెలంగాణ ప్రభుత్వం ఆన్ లైన్ రమ్మీని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సైట్లు ఓపెన్ కాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకొన్నారు.


 

Follow Us:
Download App:
  • android
  • ios