Asianet News TeluguAsianet News Telugu

కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదు.. కలెక్టర్ కి ఫిర్యాదు

ఓ వ్యక్తి తనకు వచ్చిన కష్టాన్ని తెలుసుకొని కలెక్టర్ కూడా ఖంగుతిన్నాడు. ఇంతకీ అతనికి వచ్చిన సమస్య ఏంటో తెలుసా..? కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదట

man letter to collector for king fisher beer
Author
Hyderabad, First Published Sep 25, 2018, 3:11 PM IST

ప్రజలకు ఏవైనా సమస్యలు ఉంటే...కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం చాలా కామన్. కానీ ఓ వ్యక్తి తనకు వచ్చిన కష్టాన్ని తెలుసుకొని కలెక్టర్ కూడా ఖంగుతిన్నాడు. ఇంతకీ అతనికి వచ్చిన సమస్య ఏంటో తెలుసా..? కింగ్ ఫిషర్ బీర్ దొరకడం లేదట. ఆయన కలెక్టర్ రాసిన ఓ లేఖలో ఇలా పేర్కొన్నాడు.

‘‘శ్రీయుత గౌరవనీయులైన కలెక్టర్ గారికి తమరికి మనవి చేయునది ఏమనగా.. జగిత్యాల పట్టణంలోని వైన్ షాప్ మరియు బార్ అండ్ రెస్టారెంట్ లలో గత కొన్నేళ్లుగా కింగ్ ఫిషర్ బీర్లను అతమ్మడం నిలిపివేశారు. ప్రజలలో, మద్యం ప్రియుల్లో, యువత ఎక్కువగా ఇష్టపడి సేవించే బీర్లలో కింగ్ ఫిషర్ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ బీర్ల విక్రయం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. కానీ జగిత్యాలలోని మద్యం విక్రయదారులు సిండికేటుగా మారి కింగ్ ఫిషర్ బీరును విక్రయించడం బంద్ చేశారు. ఈ బీర్ల స్థానంలో మరొక నాసిరకం బీరును విక్రయిస్తూ కొనుగోలు దారులను మోసం చేస్తున్నారని మనవి చేస్తున్నాను. భారత రాజ్యంగం లోని ఆర్టికల్-19 ద్వారా సక్రమించిన ప్రాథమిక హక్కులలోని స్వేచ్చతో కూడిన కొనుగోలు హక్కుకు మద్యం విక్రయదారులు భంగం కలిగిస్తున్నారని  తమకు మనవి చేస్తున్నాను. జగిత్యాల పట్టణం మరియు పలు మండలాల్లో ఏ నెల నుంచి కింగ్ ఫిషర్ బీర్లను విక్రయించడం నిలిపేశారన్న అంశంపై విచారణ జరిపించాలని మద్యం డిపోల్లో స్థానిక మద్యం వ్యాపారులు కింగ్ ఫిషర్ కోటాను కొనుగోలు చేయకపోవడంపై విచారణ జరిపి మద్యం వ్యాపారులపై చర్యలు తీసుకొని కింగ్ ఫిషర్ బీర్లను మద్యం ప్రియులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నాను’’ అని అయిల సూర్యనారాయణ అనే వ్యక్తి కలెక్టర్ కి లేఖ రాశారు.

కాగా.. ఆ లేఖను కలెక్టర్ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ కి పంపించారు. ప్రస్తుతం ఈ లేఖ వైరల్ గా మారింది. 

Follow Us:
Download App:
  • android
  • ios