భార్యను, నాలుగు నెలల కొడుకును సజీవదహనం చేశాడో భర్త.. వివరాల్లోకి వెళితే...జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన మాచెల్ల రమేశ్, గూడురుకు చెందిన కందిగ శుశ్రుత 2015లో ప్రేమించుకున్నారు. వీరిద్దరివి వేర్వేరు సామాజిక వర్గాలు.. అయినప్పటికీ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.

ఈ దంపతులకు 4 నెలల బాబు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో శుశ్రుత కొద్దిరోజులుగా తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. సమస్యను పరిష్కరించుకుందామని రమేశ్ భార్యను ఉప్పల్‌కు పిలిపించాడు. కుమారిడితో కలిసి శుశ్రుత ఔటర్ రింగ్ రోడ్‌కు చేరుకుంది.

ఈ సందర్భంగా భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు.. దీనిపై మనస్తాపం చెందిన శుశ్రత ఇంటి వద్ద నిద్రమాత్రలను మింగింది.. అంతేకాకుండా చిన్నారికి సైతం పాలలో కలిపి తాగించింది. అపస్మారక స్థితికి చేరుకున్న వారిద్దరిని రాత్రి 9 గంటల ప్రాంతంలో ప్రభాకర్ ఎన్‌క్లేవ్ ప్రాంతానికి తరలించిన రమేశ్ అనంతరం పెట్రోలో పోసి తగులబెట్టి పాలకుర్తి పోలీసులకు లొంగిపోయాడు.

ఆ తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులకు గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులను కాల్చి వేసినట్లుగా కనిపించడంతో వారు ఘట్‌కేసర్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సగం కాలిన మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.