పోలం అమ్మడానికి నిరాకరించిందన్న అక్కసుతో భార్యను...కుమారుడిని అత్యంత దారుణంగా హత్య చేశాడో వ్యక్తి.. వివరాల్లోకి వ్యక్తి సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం కరస్‌గుత్తికి చెందిన వెంకట్‌రెడ్డితో  మహారాష్ట్రకు చెందిన కవితతో పదేళ్ల క్రితం వివాహమైంది.

మద్యానికి ఇతర దురలవాట్లకు బానిసైన అతను భార్యతో తరచుగా గొడవ పడేవాడు. చివరికి ఎకరా భూమిని ఇటీవల దాదాపు రూ.20 లక్షలకు విక్రయించాడు. వచ్చి డబ్బుతో జల్సాలు చేయడంతో పాటు ఒక వాహనాన్ని తీసుకొచ్చి.. కొన్ని రోజులు నడిపాడు. తీరా అవి అయిపోవడంతో మళ్లీ విపరీతంగా అప్పులు చేశాడు.

దీంతో వాటిని తీర్చడానికి మిగిలిన నాలుగెకరాలను అమ్మేస్తాడని భయపడిన కవిత దానిని పెద్దల సమక్షంలో తన పేరు మీద రాయించుకుంది. అయితపే ఆ భూమిని సైతం విక్రయిద్దామంటూ వెంకట్‌రెడ్డి భార్యతో గొడవపడేవాడు.

భవిష్యత్తులో తన కుమారుడికి ఉపయోగపడుతుందని భావించిన ఆమె అందుకు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. తనకు భూమి దక్కాలంటే భార్యను అడ్డుతొలగించడమే మార్గమంటూ పథకం వేశాడు.

బుధవారం మధ్నాహ్నం ఆమె గొంతు నులిమి చంపేశాడు. తండ్రి తల్లిని చంపుతుండగా చూసిన కుమారుడు దినేశ్ రెడ్డి ఎవరికైనా చెబుతాడని భావించి.. చిన్నారిని సైతం గొంతు నులిమి చంపేశాడు.

అనంతరం ఆధారాలు మాయం చేసేందుకు వీలుగా రెండు మృతదేహాలపైనా  కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తనకు ఏమీ తెలియనట్లు ఇంటికి గడియపెట్టి గ్రామంలో సాయంత్రం వరకు తిరిగాడు.

అనంతరం రాత్రి ఇంటికి వచ్చిన అతను భార్య, కుమారుడు ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారని పెద్దగా ఏడ్వడం మొదలుపెట్టాడు. అతని అరుపులతో ఇరుగు పొరుగు అక్కడికి చేరకుని ఇంటిని పరిశీలించారు.

కవితతో ప్రతిరోజు గొడవపడే వెంకటరెడ్డి మాటలను వారు నమ్మలేదు.... అతనే భార్యాబిడ్డలను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనాస్థలికి చేరుకుని వెంకటరెడ్డని అదుపులోకి తీసుకున్నారు.