ఆస్తి కోసం ఓ వ్యక్తి ఏకంగా.. కన్న తల్లిని హత్య చేశాడు. అందుకు తండ్రి సహాయం కూడా తీసుకున్నాడు. అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపేశాడు. ఈ సంఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

దండెంపల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన యాదమ్మ(55),ఆమె భర్త గంగయ్య దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె కళావతిని తన సోదరుడు శ్రీనుకి ఇచ్చి వివాహం జరిపించింది. కొడుకు  యాదగిరికి కూడా పెళ్లి కాగా.. భార్యభర్తలు విడిపోయారు. మళ్లీ పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే.. వాటిని బావ శ్రీను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నాడు. దీంతోపాటు వ్యవసాయ భూమిలో వాటా కోసం శ్రీను కోర్టులో కేసు వేశాడు. తర్వాత వాటా కు అంగీకారం కుదరడంతో కేసు విరమించుకున్నాడు.

ఈ విషయంలో గత కొంతకాలంగా కుటుంబసభ్యుల మధ్య వివాదాలు నడుస్తున్నాయి.  ఈ క్రమంలో..కుమారుడు యాదగిరి ఇటీవల తమ ఇంట్లో కూర్చొని.. తమకు ఉన్న ఆస్తులు, అప్పుల గురించి మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో  యాదమ్మ.. తన ఆస్తి విషయంలో అన్ని నిర్ణయాలు తన సోదరుడు శ్రీను సలహా తీసుకుంటానని.. అతను చెప్పినట్లే చేస్తానని చెప్పాడు. దీంతో.. ఈ విషయంలో వారి మధ్య గొడవ జ రిగింది.

ఈ క్రమంలో ఆవేశానికి గురైన యాదగిరి.. తల్లి యాదమ్మను అతి కిరాతకంగా హత్య చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.