నాగర్ కర్నూలు: తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో అమానుషమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కన్నతల్లినే కర్కశంగా చంపేశాడు. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో సంగణమోని చంద్రమ్మ (65) తన కుమారుడు రాముడు 940)తో కలిసి ఉంటోంది. 

రాముడు మద్యానికి బానిసయ్యాడు. దాంతో ప్రతి రోజూ డబ్బుల కోసం తల్లితో గొడవ పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వాలని తల్లితో గొడవ పడ్డాడు. ఆ తర్వాత తల్లి నిద్రిస్తున్న సమయంలో కొడవలితో ఆమె గొంతు కోశాడు. ఆ తర్వాత ఆమె తలను తీసుకుని పారిపోయాడు. 

రాముడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. పదేళ్ల క్రితం వారు అతన్ని వదిలేశారు. ప్రిత రోజూ అర్థరాత్రి వరకు తల్లితో గొడవ పడి డబ్బులు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.