కష్టపడి సంపాదించిన డబ్బులను కొడుకు క్రికెట్ బెట్టింగ్ కోసం తగలేస్తుంటే ఆ తల్లి చూసి తట్టుకోలేకపోయింది. దీంతో.. అలా చేయవద్దని మందలించింది. అంతే.. తన జల్సాలకు అడ్డుగా ఉన్నారని విషయం పెట్టి తల్లి, చెల్లిని అతి కిరాకతంగా చంపేశాడు. ఈ దారుణ సంఘటన మేడ్చల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామానికి చెందిన ప్రభాకర్ రెడ్డి మూడేళ్ల కిందట రోడ్డు ప్రమాదంలోచనిపోయారు. అప్పటి నుంచి ఆయన భార్య సునీత(42) కుమారుడు సాయినాథ్ రెడ్డి, కుమార్తె అనూషలను కష్టపడి చదివిస్తోంది. సునీత ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుండగా.. సాయినాథ్ రెడ్డి ఎంటెక్ చదవి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. అనూష బీఫార్మసీ చదువుతోంది. ప్రభాకర్ రెడ్డి చనిపోయిన సమయంలో వచ్చిన ఇన్సూరెన్స్ డబ్బు, భూమి అమ్మగా వచ్చిన డబ్బులు మొత్తం రూ.20లక్షలు బ్యాంకులో దాడి పెట్టారు.

ఇటీవల సాయినాథ్ రెడ్డి ఐపీఎల్  క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతూ తీవ్రంగా నష్టపోయాడు. తల్లికి తెలీకుండా బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేశాడు. ఇంట్లో ఉన్న బంగారు నగలను కూడా ాఅమ్మేశాడు. ఈ విషయం సునీతకు తెలియడంతో కొడుకుని నిలదీసింది. దీంతో.. తన జల్సాలకు తల్లి, చెల్లి అడ్డుగా ఉన్నారని భావించాడు. దీంతో.. వారికి తెలీకుండా వారు తినే భోజనంలో విషం కలిపాడు.

ఆ విషయం తెలియని సునీత, అనూషలు భోజనం చేశారు. దీంతో.. వారికి కడుపులో తిప్పడం లాంటివి జరుగుతుండటంతో వెంటనే సాయినాథ్ కి ఫోన్ చేసి చెప్పారు. ఇంటికి చేరుకున్న అతను.. వారిని ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లకుండా చనిపోయేంత వరకు ఎదరు చూశాడు. తర్వాత చనిపోయారంటూ ఏడవడం మొదలుపెట్టాడు. అయితే.. అతని తీరు అనుమానం గా అనిపించి బంధువులు నిలదీయడంతో.. తానే నేరం చేసినట్లు అంగీకరించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.