పాత కక్షల కారణంగా.. మాటువేసి మరీ తన శత్రువుని హత్య చేశాడు. అనంతరం భయంతో.. అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ సంఘటన మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... నవాబుపేట మండలం పోమాల్ గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య(35) కి.. అదే గ్రామానికి చెందిన యాదయ్యకు పాత కక్షలు ఉన్నాయి. ఈ క్రమంలో వెంకటయ్యను హత్య చేసేందుకు యాదయ్య ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. ఆదివారం రాత్రి పనిమీద బయటకు వెళ్లి వస్తున్న వెంకటయ్యను.. యాదయ్య అడ్డగించాడు. అతనిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించాడు.

ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ సోమవారం వెంకటయ్య కన్నుమూశాడు. వెంటకయ్య చనిపోయాడనే విషయం తెలుసుకున్న యాదయ్యకు భయం పట్టుకంుది. తనను పోలీసులు అరెస్టు చేస్తారేమో అనే భయంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.