Asianet News TeluguAsianet News Telugu

21 సార్లు తప్పించుకున్న కేటుగాడు.. ‘‘90 ఎంఎల్’’ మందు పట్టించింది

ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండేది పగలేకదా..? హెల్మెట్ పెట్టుకోవాల్సింది పగలే కదా.. అనుకుంటూ రాత్రి వేళలలో ట్రాఫిక్ రూల్స్‌ను పట్టించుకోని వారికి ఓ షాకింగ న్యూస్. 21 సార్లు ట్రాఫిక్ చలానాలు విధింపబడిన ఓ కేటుగాడిని ... మద్యం బాటిల్ పట్టించింది. 

man got challaned so much for signal jumping
Author
Hyderabad, First Published Feb 13, 2019, 11:00 AM IST

ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండేది పగలేకదా..? హెల్మెట్ పెట్టుకోవాల్సింది పగలే కదా.. అనుకుంటూ రాత్రి వేళలలో ట్రాఫిక్ రూల్స్‌ను పట్టించుకోని వారికి ఓ షాకింగ న్యూస్. 21 సార్లు ట్రాఫిక్ చలానాలు విధింపబడిన ఓ కేటుగాడిని ... మద్యం బాటిల్ పట్టించింది.

వివరాల్లోకి వెళితే... జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం వడ్డిచర్లకు చెందిన చాంద్ పాషా అనే యువకుడు తన బైక్‌పై ఈ నెల 9న రాత్రి వేళ తన మోటార్ సైకిల్‌పై వేగంగా ఇంటికి దూసుకెళ్తున్నాడు. అదే సమయంలో 365బి నెంబర్ జాతీయ రహదారిపై లింగాలఘణపురం ఎస్సై రవీందర్ తన సిబ్బందితో డ్రంకన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో అటుగా వచ్చిన చాంద్ పాషాకు బ్రీతింగ్ ఎనలైజర్‌తో పరీక్షలు నిర్వహించాడు. ఈ పరీక్షలో చాంద్ పాషా మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు నిర్థారణ అయ్యింది. అయితే ఈ చలాన్ విధానంలో బైక్ డేటా పరిశీలించగా అప్పటికే 21 సార్లు తన బైక్‌పై పలు ప్రదేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు పట్టించుకోకుండా సిగ్నల్ దాటినట్లు కేసు నమోదైనట్లు అసలు విషయం బయటపడింది.

ఆర్నెళ్ల నుంచి తప్పించుకుంటున్న తనను 90 ఎంఎల్ మద్యం పట్టించిందని చాంద్‌పాషా కుమిలిపోయాడు. డ్రంకెన్ డ్రైవ్ చేసినందుకు రూ.1000, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేసినందుకు రూ.1000, గతంలో సిగ్నల్ జంప్ చేసిన 21 చలానాలకు సంబంధించిన తాలూకు రూ. 2,800 మొత్తం కలిపి రూ.4,800 జరిమానా చెల్లించాల్సిందిగా పోలీసులు చాంద్ పాషాకు ఓటీపీ ద్వారా జరిమానా విధించారు.

ఈ మొత్తాన్ని వెంటనే మీ-సేవలో చెల్లించాలని పోలీసులు తెలిపారు. రాత్రి వేళల్లో సైతం ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, లేదంటే తమ నిఘా కంటికి చిక్కకతప్పదని వాహనదారులను పోలీసులు హెచ్చరించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios