స్టేటస్ లో తన భర్త పక్కన మరో అమ్మాయి కనిపించింది. అంతే వెంటనే కోపంతో.. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు భర్తకు ఫోన్ చేసింది. 

ఉదయాన్నే ఇంటి నుంచి ఆఫీసుకు బయలుదేరి వెళ్లాడు. అలా వెళ్లిన కొద్ది సేపటికే వాట్సాప్ లో స్టేటస్ పెట్టాడు. భర్త ఏం స్టేటస్ పెట్టాడా అని చూసిన భార్యకు ఊహించని షాక్ ఎదురైంది. స్టేటస్ లో తన భర్త పక్కన మరో అమ్మాయి కనిపించింది. అంతే వెంటనే కోపంతో.. ఆ అమ్మాయి ఎవరో తెలుసుకునేందుకు భర్తకు ఫోన్ చేసింది. 

వెంటనే ఇంటికి రావాలని ఆదేశించింది. అతను కూడా ఇంటికి వస్తున్నాని చెప్పి.. అడ్రస్ లేకుండా పోయాడు. ఈ సంఘటన మేడ్చల్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మౌలాలి ప్రశాంత్‌నగర్‌కు చెందిన రాకేష్‌(30) రైల్వే ఉద్యోగి. ఈ నెల 18 వ తేదీ రోజువారీలాగానే సికింద్రాబాద్‌లో విధులకు వెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత అతని సెల్‌ఫోన్‌ స్టేటస్‌లో మరొక అమ్మాయితో ఉన్న ఫొటోను రాకేష్‌ భార్య అశ్విని గమనించి ఫోన్‌ చేసింది. ఇంటికి వస్తున్నాని చెప్పిన రాకేష్‌ రాలేదు. సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ వస్తుండడంతో మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.