Asianet News TeluguAsianet News Telugu

లడ్డూలతో భోజనం పెట్టాలంటూ.. రూ. 25లక్షలకు పూజారి టోకరా...

నిజామాబాద్ కంఠేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కొత్త  మాధవి లత  ఖిల్లా రోడ్ లో షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త గణేష్ పక్షవాతం, మనుమరాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మాధవిలత ధర్మారం (బి) లో ఉన్న ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజారికి తన సమస్యలను ఏకరువు పెట్టింది.

man fraud rs. 25lakhs in the name of puja in nizamabad - bsb
Author
Hyderabad, First Published Jul 28, 2021, 10:32 AM IST

నిజామాబాద్ : మహిళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఓ పూజారి దారుణానికి తెగబడ్డాడు. పూజలతో గ్రహ స్థితి బాగు చేస్తానంటూ మాయమాటలతో నమ్మించాడు. ఆమె దగ్గర రూ. 25 లక్షలు కాజేసి.. ఆ తర్వాత పారిపోయాడు. డిచ్‌పల్లి ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో ఉన్న శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో కొంతకాలంగా శ్రీనివాస్ శర్మ పూజారి గా పని చేస్తున్నాడు.

నిజామాబాద్ కంఠేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కొత్త  మాధవి లత  ఖిల్లా రోడ్ లో షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆమె భర్త గణేష్ పక్షవాతం, మనుమరాలు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. మాధవిలత ధర్మారం (బి) లో ఉన్న ఆలయాన్ని సందర్శించి అక్కడ పూజారికి తన సమస్యలను ఏకరువు పెట్టింది.  
ఇదే అదనుగా గ్రహించిన పూజారి వారి గ్రహ స్థితి బాగా లేదని కొంతమంది భక్తులకు లడ్డూలతో భోజనాలు వడ్డిస్తే సమస్యలన్నీ తీరుతాయని నమ్మించాడు. పూజారి 
మాయ మాటలు నమ్మిన మాధవీలత శ్రీనగర్ లో రెండు ఎకరాల భూమి అమ్మగా వచ్చిన రూ.25 లక్షలు దశలవారీగా పూజారికి ఇచ్చింది. 

ఆ తరువాత మోసపోయానని గ్రహించి, తన డబ్బును తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో పూజారి శ్రీనివాస శర్మ మే 29 నుంచి కనిపించడం లేదు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios