ఐదురోజులుగా కనిపించకుండా పోయిన కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. ఆ తల్లిదండ్రులు సంతోషంతో ఊపిరి పీల్చుకునే లోపే ఆత్మహత్య చేసుకుని విషాదాన్ని మిగిల్చాడు.
ఐదురోజులుగా కనిపించకుండా పోయిన కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నానని ఫోన్ చేసి చెప్పాడు. ఆ తల్లిదండ్రులు సంతోషంతో ఊపిరి పీల్చుకునే లోపే ఆత్మహత్య చేసుకుని విషాదాన్ని మిగిల్చాడు.
సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ’అమ్మా.. నేను ఇంటికొస్తున్నా.. బాధపడకు.. హైదరాబాద్‌లో దోస్తుల దగ్గరికి పోయినా.. ఈ రోజు వస్తున్నా’ అని తల్లికి ఫోన్ చేసి చెప్పిన కొద్ది సేపటికే ఆ కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణానికి చెందిన శ్రీరాం రవిశేఖర్, జ్యోతి దంపతుల కుమారుడు నవకాంత్.. ఈ నెల 3న ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. దీంట్లో తల్లిదండ్రులు ఎంత వెతికినా అతని ఆచూకీ దొరకలేదు.
కొడుకు కోసం దిగులు పడుతున్న తల్లిదండ్రులను 5 రోజుల తర్వాత ఆదివారం నాడు అతను ఫోన్ చేశాడు. ఇంటికి వస్తున్నా ఆందోళన చెందొద్దని చెప్పాడు. దీంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే అదే రోజు సాయంత్రానికి నవకాంత్ కామారెడ్డి శివారులోని రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు.
జేబులో దొరికిన ఆధార్ కార్డ్ ఆధారంగా రైల్వే పోలీసులు నవకాంత్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. ఇంటికొస్తున్నా అని చెప్పిన కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో.. ఆ తల్లిదండ్రుల దుంఖాన్ని ఎవ్వరూ తీర్చలేకపోతున్నారు. ‘అయ్యో ఎంత పని చేస్తివి కొడుకా’ అంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోధిస్తున్నారు.
