కొమరంభీం జిల్లాలో పెద్దవాగుపై కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన: మల్లయ్య అనే వ్యక్తి గల్లంతు

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దవాగులో  వరదలో మల్లయ్య అనే వ్యక్తి  గల్లంతయ్యారు. 

Man drowned in Peddavagu of Komaram Bheem Asifabad District lns

ఆదిలాబాద్: కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దవాగులో  వరదలో మల్లయ్య అనే వ్యక్తి గల్లంతయ్యారు. మల్లయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో   రెండు రోజులుగా  కురుస్తున్న భారీ వర్షాలకు  పెద్దవాగుకు  భారీగా వరద పోటెత్తింది.  దీంతో  పెద్దవాగుపై  నిర్మించిన  తాత్కాలిక వంతెన  కొట్టుకుపోయింది.   తాత్కాలిక వంతెన కొట్టుకుపోవడంతో  మల్లయ్య అనే వ్యక్తి  వరదతో కొట్టుకుపోయారు.

2022  ఆగష్టు 14వ తేదీన  పెద్దవాగుపై  నిర్మించిన  బ్రిడ్జి కుంగిపోయింది.  దీంతో ఈ బ్రిడ్జిపై  రాకపోకలను  నిలిపివేశారు అధికారులు.  గత ఏడాది ఆగష్టు మాసంలో  కురిసిన వర్షాల కారణంగా  పెద్దవాగుకు  పోటెత్తిన వరద కారణంగా  బ్రిడ్జి కుంగిపోయింది. 

దీంతో  నాటు పడవల ద్వారా  స్థానికులు  పెద్దవాగును దాటుతున్నారు. అయితే  బ్రిడ్జిని దాటేందుకు  తాత్కాలికంగా వంతెనను ఏర్పాటు  చేశారు.  అయితే  పెద్దవాగుకు వరద పోటెత్తిన  కారణంగా ఈ వంతెన  కొట్టుకుపోవడంతో  స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. 

2022 సెప్టెంబర్  22న  పెద్దవాగును నాటు పడవ ద్వారా నాటుతున్న నలుగురు ప్రయాణీకులు  ప్రమాదానికి గురయ్యారు. స్థానికులు  వారిని అప్పట్లో రక్షించారు.దహేగాం, బెజ్జూరు, కాగజ్ నగర్ వాసులు  పెద్దవాగు  వంతెనను పరిశీలిస్తున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios