వారం రోజుల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో చేరబోతూ.. గుండెపోటుతో మరణించాడో యువకుడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో విషాదం నింపింది. 

ఖమ్మం : గుండెపోటు మరణాల జాబితాలో మరో యువకుడు చేరాడు. కొట్టే మురళీకృష్ణ (26) అనే యువకుడు సినిమా చూస్తూ ఉన్నట్టుండి కుప్పకూలి మరణించాడు. ఇంజనీరింగ్ చదువుకున్న మురళీకృష్ణ సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా సంపాదించాడు. వారం రోజుల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంది. అంతలోనే గుండెపోటు రూపంలో మృత్యువు అతడిని కబలించింది. ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. 

కొట్టే మురళీకృష్ణ తాపీ మేస్త్రి, తల్లి కూలీ పనులు చేస్తూ జీవిస్తుంటారు. కొడుకును తమ తాహతుకు మించి కష్టపడి చదివించారు. అతను కూడా తల్లిదండ్రుల కలలను నెరవేరుస్తూ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. కొట్టే మురళీకృష్ణది ఖమ్మం జిల్లా మధిర మండలం నక్కలగరుబు గ్రామం. తల్లిదండ్రులు కొట్టే పెద్దకృష్ణ, రాధా. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు.

కొట్టే మురళీకృష్ణ బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్న ఆశతో దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. కోర్సులు పూర్తి చేశాడు. ఇటీవల హైదరాబాదులోని ఓ సాఫ్ట్వేర్ సంస్థలో మురళీకృష్ణ కు ఉద్యోగం కూడా వచ్చింది. ఈ నెల 17వ తేదీన ఉద్యోగంలో చేరాల్సి ఉంది. కొద్ది రోజుల క్రితం సొంతూరికి వచ్చాడు మురళీకృష్ణ. సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మారానని తల్లిదండ్రులకు చెప్పి సంతోషాన్ని పంచుకున్నాడు.

భార్య ఇంట్లో లేనప్పుడు.. కూతురి భోజనంలో నిద్ర మాత్రలు కలిసి అత్యాచారం.. తండ్రికి మరణించే వరకు జైలుశిక్ష..

తల్లిదండ్రులకు కష్టాలు తీరాయని.. మిగతా బాధ్యతలు తాను చూసుకుంటానని చెప్పి హైదరాబాదుకు తిరిగి వచ్చాడు. గురువారం సాయంత్రం ఫ్రెండ్స్ తో కలిసి సినిమాకు వెళ్ళాడు. సినిమా చూస్తూ చూస్తున్నవాడు హఠాత్తుగా పడిపోయాడు. పక్కనే ఉన్న స్నేహితులు ఏం జరిగిందో అర్థంకాక ఆ తర్వాత అతడిని.. వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయినా ఫలితం దక్కలేదు. 

కొడుకు చనిపోయిన విషయం తెలిసిన తల్లిదండ్రుల బాధకు అంతులేకుండా పోయింది. తమ కష్టాలు తీరిపోయాయని చెప్పి.. అంతలోనే తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం కొట్టే మురళీకృష్ణ అంత్యక్రియలు నక్కలగరుబు గ్రామంలో నిర్వహించారు.

ఇదిలా ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఓ వ్యక్తి ఆటో నడుపుతూ ప్రమాదవశాత్తు టూ వీలర్ ను ఢీకొట్టాడు. దీంతో ఆ ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఓ మహిళ కింద పడింది. ఆమెకు గాయాలయ్యాయి. అది చూసిన ఆటో నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. కిందపడిన మహిళకు సపర్యాలు చేశాడు. తన ఆటోలోనే ఆసుపత్రికి తరలించి ఆమెకు చికిత్స అందించేలా చేయడానికి ప్రయత్నించాడు. ఆమెను ఆటోలోకి ఎక్కించుకున్నాడు.

ఒక రెండు అడుగుల దూరం నడిపేడో లేదో అతడికి తీవ్రమైన గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తెలంగాలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే… ఈ ఘటనలో చనిపోయింది మణుగూరు మండలం కట్టమల్లారానికి చెందిన మోహన్ రావు (61). అతను జీవనోపాధి కోసం ఆటో నడుపుకుంటున్నాడు. తన పనిలో భాగంగా శుక్రవారం రోజు కూడా మధ్యాహ్నం.. రాయిగూడెం నుంచి ముగ్గురు ప్రయాణికులతో మణుగూరు బయలుదేరాడు.

ఇక అదే రాయిగూడెం గ్రామానికి చెందిన ముత్తమ్మ, సత్యం అనే దంపతులు కమలాపురం నుంచి టూ వీలర్ మీద రాయిగూడెం వస్తున్నారు. గ్రామ మూల మలుపు వద్ద ఎదురెదురుగా వస్తున్న వీరిద్దరి వాహనాలు చూసుకోకుండా ఢీకొన్నాయి. దీంతో బైక్ మీద వెనక కూర్చున్న ముత్తమ్మ కిందపడిపోయింది. తీవ్ర గాయాలయ్యాయి. అది చూసిన మోహన్ రావు, ఆటో లో ఉన్న మిగతా ప్రయాణికులు ఆమెకు సపర్యాలు చేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు ఆమెను మోహన్ రావు ఆటోలో కూర్చోబెట్టారు. యాక్సిడెంట్ వల్ల అప్పటికే మోహన్ రావు తీవ్ర ఆందోళన చెందాడు. 

ఈ ఒత్తిడితో ఒక రెండు అడుగులు ఆటో నడపగానే బండిలో అలాగే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ఆటోలోని ప్రయాణికులు ముత్తమ్మ భర్త అతడిని కూడా వేరే ఆటోలో మణుగూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. గాయాల పాలైన ముత్తమ్మకు చికిత్స అందిస్తున్నారు. దీని మీద సమాచారం అందడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్నారు.