పాములు పట్టే ఓ వ్యక్తి ఆ పాము కాటుతోనే మరణించిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తాచుపాము కాటుతో ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.
కొత్తగూడెం : ఎక్కడ snake కనిపించినా చాకచక్యంగా బంధించే వ్యక్తి అదే Snake Biteతో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారానికి చెందిన షరీఫ్ (31) Electricianగా పనిచేస్తునే పాములను పడుతుంటాడు. దీంతో ఎవరి ఇంట్లోకి పాము వచ్చినా స్థానికులు ఆయనకు సమాచారం అందిస్తారు. ఇదే క్రమంలో రిక్షా కాలనీకి చెందిన బానోతు వెంకట్రావు ఇంట్లోని బావిలో మంగళవారం తాచుపాము కనిపించగా, షరీఫ్ దాన్ని బయటకు తీసుకు వచ్చి సుమారు గంటపాటు రోడ్డుపై సరదాగా ఆడించాడు.
ఈ సమయంలోనే తాచు పాము అతని చేతిపై కాటు వేసింది. అదేమీ పట్టించుకోని షరీఫ్ పామును బస్తాలో వేసుకుని తీసుకెళ్లి అడవిలో వదిలేసి తిరిగి వస్తుండగా సురక్షా బస్టాండ్ వద్ద కిందపడిపోయాడు. దీంతో స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. వెంటనే పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధరించారు. మృతుని తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ ముత్యం రమేష్ తెలిపారు. పాములను అత్యంత చాకచక్యంగా బంధించే షరీఫ్ అదే పాముకాటుతో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. పాము కాటువేయగానే ఆసుపత్రికి వెళ్లాలి.. అని సూచించినా షరీఫ్ పట్టించుకోలేదు అని సమాచారం.
పాము వెన్నుముకకు సర్జరీ...
మార్చి 21న వనపర్తిలో ఓ వ్యక్తి గాయపడిన పాముకు చికిత్స చేయించాడు. king cobra అంటేనే భయంతో పరుగులు పెడతారు కానీ సర్పరక్షకుడిగా పేరొందిన Sagar Snake Society వ్యవస్థాపకుడు, హోంగార్డ్ కృష్ణసాగర్ తీరే వేరు. ఎక్కడైనా పాము కనిపించింది అని ఫోన్ వస్తే.. తీసుకెళ్లి సురక్షిత ప్రాంతంలో వదిలేస్తారు. ఆదివారం వనపర్తి పట్టణం నాగవరం శివారులో కదిరెపాడు ధర్మయ్య ఇంటి నిర్మాణానికి పునాది తీస్తుండగా.. మట్టిపెళ్లలు పడి నాగుపాముకు గాయం అయ్యింది. ఇది గమనించిన వారు కృష్ణ సాగర్ కు సమాచారం ఇచ్చారు.
గాయంతో పాము ఇబ్బంది పడుతుండడం చూసి ఆయన Veterinarian ఆంజనేయులును ఆశ్రయించారు. ‘దాని ఎముక విరిగినట్టుంది ఎక్స్రే తీస్తే కానీ వైద్యం చేయలేం’ అని డాక్టర్లు తేల్చారు. చివరికి డాక్టర్ పగిడాల శ్రీనివాస్ రెడ్డి ఆస్పత్రిలో పాముకు ఎక్స్రే తీశారు. పాముకు ఎముక విరగడంతో సిమెంట్ కట్టు వేశారు. దానికి చికిత్స పూర్తయ్యాక వనపర్తి చిట్టడవిలో వదిలేస్తానని కృష్ణసాగర్ తెలిపాడు.
పాము దవడకు 12 కుట్లు...
ఇలాంటి ఘటనే రాజమహేంద్రవరంలో నిరుడు నవంబర్ లో జరిగింది. Rajamahendravaramలో జేఎన్ రోడ్డు దాటుతున్న అయిదున్నర అడుగుల నాగుపాము ఓ ద్విచక్ర వాహనం కిందపడి గాయపడింది. విక్రమ్ జైన్ అనే వ్యక్తి, దాన్ని పట్టుకుని వన్యప్రాణి విభాగం వైద్యుడు ఆండ్ర ఫణీంద్రకు చూపించారు. నాగుపాము ఎడమవైపు దవడ కింది భాగం ఛిద్రమవడంతో 12 stitches వేసి ఇంజక్షన్లు ఇచ్చారు. ఇది ఆరోగ్యంగా ఉందని కప్పను ఆహారంగా వేస్తే ఆరగించిందని ఫణీంద్ర తెలిపారు. సర్పరక్షకుడు వారాది ఈశ్వరరావు శుక్రవారం రాజమహేంద్రవరం నగర శివార్లలో అటవీ ప్రాంతంలో దీన్ని విడిచిపెట్టారు.
