కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. మనుషుల్ని మానసికంగా కృంగదీస్తోంది. కరోనా భయం అనేక మానసిక సమస్యలకు దారితీస్తోంది. రాష్ట్రంలో కొనసాగుతున్న సెకండ్ వేవ్ విజృంభణతో కేసులు రాకెట్ స్పీడ్ లో పెరిగిపోతున్నాయి. 

"

తెలంగాణలోని అనేక జిల్లాల్లో కరోనా విలయతాండవలం చేస్తోంది. తాజాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఓ విషాద ఘటన చోటు చేసకుంది. కరోనా వచ్చిందేమో అనే భయంలో ఓ యువకుడు బస్సు టైర్ల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

హృదయవిదారకమైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. గత కొద్ది రోజులుగా ఈ యువకుడు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో తనకు కరోనా వచ్చిందనే అనుమానం అతన్ని నిలవనీయలేదు. 

అంతే టెస్ట్ చేయించుకోవడానికి కూడా ధైర్యం చేయలేక, భయంతో బస్సు టైర్ల కింద తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రామగుండం కార్పొరేషన్ రాజీవ్ రహదారిపై జరిగింది.

కాగా, ఢిల్లీకి చెందిన ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ వివేక్ రాయ్ ఆత్మహత్య చేసుకోవడం విషాదం నెలకొంది. దేశంలో కరోనా మహమ్మారి నుంచి లక్షలాది మంది ప్రాణాల్ని కాపాడుతున్న డాక్టర్స్ రకరకాల కారణాల వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ లెక్కల ప్రకారం కరోనా సోకడం వల్లే సుమారు 800 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. 

హైదరాబాదులో దారుణం: మహిళపై కార్పోరేటర్ అత్యాచారం...

అయితే ఇటీవల భారత్ లో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండడంతో ప్రాణాలను తెగించి కరోనా బాధితులకు ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్లు మనోవేదనకు గురవుతున్నారు. తాము ట్రీట్మెంట్ ఇచ్చిన బాధితులు కళ్లముందు ప్రాణాలు కోల్పోతుంటే అసహాయులై కృంగిపోతున్నారు. మరికొందరు సున్నిత మనస్కులు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. 

కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ మాస్కులు తప్పకుండా ధరించాలని, శానిటైజ్ చేసుకోవాలని, సామాజిక దూరం పాటించాలని ఏషియానెట్ విజ్ఢప్తి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా కరోనా టీకా తీసుకోవాలని కూడా కోరుతోంది. అందరం కలిసి కరోనా వ్యాప్తిని అరికడుదాం, మనల్ని మనం రక్షించుకుందాం.  #ANCares #IndiaFightsCorona