హైదరాబాద్: ఇటీవల హైదరాబాదులోని విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనను మరిచిపోక ముందే అటువంటి ఘటనే మరోటి చోటు చేసుకుంది. ఈ ఘటన అమీర్ పేట మెట్రో స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.

హైదరాబాదులోని అమీర్‌పేట్ మెట్రో స్టేషన్ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం మెట్రో స్టేషన్‌కు వచ్చిన ఆ వ్యక్తి పైనుంచి కిందకు దూకి మరణించాడు. 

కాగా, ఆ వ్యక్తికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సమాచారం అందిన వెంటనే ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ఆ వ్యక్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత వార్త

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం