హైదరాబాద్ మాదాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. అరవింద్ అనే క్యూనెట్ సంస్థ బాధితుడు బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. క్యూనెట్ స్కాంలో అతను సుమారు రూ.20 లక్షల వరకు పొగొట్టుకున్నాడు.

దీంతో మనస్తాపానికి గురైన అరవింద్.. కొద్దిరోజుల నుంచి లోలోపల కుమిలిపోతున్నాడు, దీనికి తోడు ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అరవింద్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా... క్యూనెట్ సంస్థ మోసాలపై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో పలువురు ఫిర్యాదు చేశారు.