క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే  భారీగా లాభాలు వస్తాయని జనగామ జిల్లా (jangaon)పామనూరు గ్రామానికి చెందిన పల్నాటి నవీన్ చాలా మందిని నమ్మించాడు. ముందుగా లక్షా 70 వేల చొప్పున చెల్లిస్తే వారానికి 13 వేల చొప్పున .. 52 వారాలతో పాటు డబ్బు వస్తుందని నమ్మించాడు నవీన్ (naveen) . 

క్రిప్టో కరెన్సీ (cryptocurrency) పేరుతో భారీ మోసం జరిగింది. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడుల పేరుతో తమను (cheating) మోసం చేసినట్లు 300 మందికి పైగా బాధితులు పోలీసులను ఆశ్రయించారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని జనగామ జిల్లా (jangaon)పామనూరు గ్రామానికి చెందిన పల్నాటి నవీన్ చాలా మందిని నమ్మించాడు. ముందుగా లక్షా 70 వేల చొప్పున చెల్లిస్తే వారానికి 13 వేల చొప్పున .. 52 వారాలతో పాటు డబ్బు వస్తుందని నమ్మించాడు నవీన్ (naveen) . దీంతో అతని మాటలు నమ్మిన చాలామంది అతనికి డబ్బు చెల్లించారు. అయితే డబ్బు కట్టిన వాళ్లలో కొందరికి మొదట డబ్బులు వచ్చాయని.. తర్వాత రావడం ఆగిపోయాయంటున్నారు బాధితులు. దీంతో నవీన్‌ను ప్రశ్నించగా.. ప్లాన్ ఏ నుంచి ప్లాన్ బీకి మారిందని కట్టుకథలు చెబుతూ కాలం వెల్లబుచ్చుతున్నాడు. డబ్బంతా ఆన్‌లైన్‌లో కట్టేశానని.. ఇప్పుడు తన దగ్గర డబ్బులు లేవని నవీన్ చెబుతున్నాడంటున్నారు బాధితులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.