Asianet News TeluguAsianet News Telugu

ఓఎల్‌ఎక్స్‌లో అమ్మేటప్పుడు జాగ్రత్త: ట్రయల్ వేస్తానని బైక్‌తో జారుకున్న యువకుడు

ప్రస్తుత కాలంలో కేటుగాళ్లు ఏ విధంగానైనా ఎదుటి వారిని మోసం చేసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చివరికి ద్విచక్ర వాహనంతో సహా ఉడాయించాడు

man cheated test drive and escaped with bike in hyderabad
Author
Hyderabad, First Published Jul 19, 2020, 5:05 PM IST

ప్రస్తుత కాలంలో కేటుగాళ్లు ఏ విధంగానైనా ఎదుటి వారిని మోసం చేసేందుకు వెనుకాడటం లేదు. తాజాగా బైక్ కొంటానని వచ్చిన ఓ యువకుడు ట్రయల్ వేస్తానని చివరికి ద్విచక్ర వాహనంతో సహా ఉడాయించాడు.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ రాజేంద్రనగర్ మండలం కిస్మత్ పూర్‌కు చెందిన పృథ్వీ యాదవ్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న పల్సర్ బైక్‌ను అమ్మడానికి ఓఎల్‌ఎక్స్‌లో పెట్టాడు.

కాగా శనివారం ఉదయం ఆ బైక్ కొంటానని ఓ యువకుడు పృథ్వీ యాదవ్‌కు ఫోన్ చేశాడు. బైక్ తీసుకుని షేక్ నాలా అల్ హమ్రా కాలనీ వద్ద గల డీమార్ట్ షోరూం వద్దకు రమ్మని ఆ యువకుడు పృథ్వీ యాదవ్‌ను ఫోన్‌లో కోరారు.

దీనిలో భాగంగా ఉదయం 11 గంటల ప్రాంతంలో పృథ్వీ యాదవ్ అక్కడికి వెళ్లగా.. పేపర్లు, ఇన్సూరెన్స్ అంటూ వివరాలు అడిగాడు. అలాగేనని ఊ కొట్టి బైక్ తీసుకుని ట్రయల్ కొడతానని చెప్పి.. మూడు ట్రయల్స్ వేశాడు. మళ్లీ ట్రయల్స్ వేస్తానని చెప్పి బైక్‌తో జారుకున్నాడు.

ఆ యువకుడు ఎంత సేపటికి రాకపోవడంతో పృథ్వీ యాదవ్ అతనికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios