ఈ క్రమంలో తన తండ్రి దశదిన కర్మ నిర్వహించేందుకు భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మణుగూరుకు వచ్చాడు. మూడు రోజుల క్రితం కార్యక్రమాలను బంధువుల సమక్షంలో జరిపించాడు.

భర్తే జీవితం అనుకుంది. పిల్లలతో కలిసి ఆనందంగా జీవించాలని ఆశపడింది. కానీ.. ఆమె ఆశలన్నీ అడియాశలైపోయాయి. కట్టుకున్న భర్తే ఆమెను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ సంఘటన మణుగూరులో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

మణుగూరు పట్టణనంలోని సుందరయ్య నగర్ కు చెందిన శీలం నాగేశ్వరరావు ఇటీవల కరోనాతో మరణించాడు. అతనికి భార్య రూపవతి, ఇద్దరు కుమారులు ఉన్నారరు. వారిలో పెద్ద కుమారుడైన శీలం శ్రీనివాసరావుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోనే నివాసముంటున్నాడు.

ఈ క్రమంలో తన తండ్రి దశదిన కర్మ నిర్వహించేందుకు భార్య, ఇద్దరు కుమారులతో కలిసి మణుగూరుకు వచ్చాడు. మూడు రోజుల క్రితం కార్యక్రమాలను బంధువుల సమక్షంలో జరిపించాడు. బంధువుల కూడా ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. బుధవారం తెల్లవారుజామున 5గంటల సమయంలో శ్రీనివాసరావు తన భార్యను గొడ్డలితో నరికి చంపి.. అనంతరం ప్రహరీ గోడ దూకి పారిపోయాడు.

తెల్లవారుజామున పక్కగదిలోని కుటుంబస్యులు గది తలుపులు తెరచి చూడగా.. ఆమె శవమై కనిపించింది. వెంటనే బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.