తన భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడని బోడ అంజయ్య, ప్రతి విషయంలో గొడవ పడుతున్నాడని రాజు, రమేష్, నాగరాజు పగ పెంచుకున్నాడు. నలుగురు కలిసి ఎలాగైనా అశోక్ ను అంతం చేయాలని ప్లాన్ చేశారు.
మెదక్ : పాతకక్షలు, extramarital affairతో హత్య చేసినట్లు.. ఒక గ్రామంలో murder చేసి అక్కడి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని మరో ఊరుకు తీసుకెళ్లి అక్కడ ఒక ఇంటికి dead bodyని వేలాడదీసినట్లు విచారణలో తేలిందని పోతులబొగుడ హత్య గురించి పోలీసులు వివరించారు. ఆదివారం జోగిపేట సీఐ కార్యాలయంలో సీఐ శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
28 డిసెంబర్, 2021న వట్ పల్లి మండలం గొర్రెకల్ గ్రామానికి చెందిన మల్కగోని అశోక్ (26) హత్యకు గురయ్యాడు. కాగా, అశోక్ అదే గ్రామానికి చెందిన బోడ అంబయ్య స్నేహితులు. ఈ నేపథ్యంలో అశోక్... అంబయ్య భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. అదే గ్రామానికి చెందిన బోడ రాజు, ఉసిరికపల్లి రమేష్, ఆత్కూరి నాగరాజులకు గొర్రెల వ్యాపారంలో అశోక్ తో గొడవలు ఉన్నాయి. గణేష్ నిమజ్జనం, బీరప్ప జాతర సమయాల్లో కూడా వీరి మధ్య గొడవలు జరిగాయి.
వేడి వేడి సాంబార్ లో పడిన చిన్నారి మృతి.. మహాబూబాబాద్ లో దారుణం..
పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి రాజీ కుదిర్చారు. తన భార్యతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడని బోడ అంజయ్య, ప్రతి విషయంలో గొడవ పడుతున్నాడని రాజు, రమేష్, నాగరాజు పగ పెంచుకున్నాడు. నలుగురు కలిసి ఎలాగైనా అశోక్ ను అంతం చేయాలని ప్లాన్ చేశారు.
డిసెంబర్ 28వ తేదీన రాత్రి అశోక్ తన రేకుల షెడ్డులో మద్యం సేవిస్తుండగా నలుగురు అక్కడికి వెళ్లారు. అక్కడ గొడవపడి అశోక్ గొంతును టవల్ తో బోడ అంబయ్య గట్టిగా బిగించగా, మిగిలిన వాు కదలకుండా కాళ్లు పట్టుకున్నారు. కొద్దిసేపటికి ఊపిరాడక అశోక్ మృతి చెందాడు.
నేరం నుంచి బయటపడేందుకు..
హత్య చేసిన తరువాత నేరం నుంచి బయటపడేందుకు బోడ అంబయ్య తన భార్య సొంతూరైన పోతుల బొగుడ గ్రామానికి రెండు బైక్ ల మీద అశోక్ మృతదేహాన్ని తరలించారు. ఎవరికీ అనుమానం రాకుండా అంబయ్య అత్తగారి ఇంటిగోడకు మృతదేహాన్ని వేలాడదీశారు. అక్కడి నుంచి ఎవరికంట పడకుండా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు.
సీసీఐ ప్రారంభించాలని కేంద్ర మంత్రులకు లేఖ రాసిన కేటీఆర్
సోదరుడి హత్యపై మల్కగోని మల్లేశం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. సీసీ ఫుటేజీల ఆధారంగా, నమ్మదగిన మాచారం మేరకు నిందితులను గొర్రెకల్ గ్రామంలో అదుపులోకి తీసుకుని విచారించడంతో వారు నేరాన్ని ఒప్పుకున్నారు. దీంతో వారిని అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం జోగిపేట కోర్టుకు పంపుతున్నాట్లు తెలిపారు. ఈ సమావేశంలో వట్ పల్లి ఎస్ఐ దశరథ్, పుల్కల్ ఎస్ ఐ నాగలక్ష్మి, పోలీస్ సిబ్బంది ఉన్నారు.
