ముషీరాబాద్ లో మైనర్ బాలిక మీద గుర్తు తెలియని నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పార్సీగుట్టలో చాక్లెట్ కోసం వెళ్లిన ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు సీతాఫల్ మండికి చెందిన లెబోర్ నర్సింహగా గుర్తించారు. రోడ్డు పక్కన నిల్చున్న ఆటో పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. 

హైదరాబాద్ : నానాటికీ అత్యాచారాలు(Rape) పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల (minor girl) కనిపిస్తే చాలు పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిసరాల్ని మరిచిపోయి మరీ కామంతో రెచ్చిపోతున్నారు కామాంధులు. అలాంటి ఓ దారుణమైన ఘటన హైదరాబాద్ లోని ముషీరాబాద్ (musheerabad)లో జరిగింది. 

ముషీరాబాద్ లో మైనర్ బాలిక మీద గుర్తు తెలియని నిందితుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. పార్సీగుట్టలో చాక్లెట్ కోసం వెళ్లిన ఏడేళ్ల చిన్నారిపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు సీతాఫల్ మండికి చెందిన లెబోర్ నర్సింహగా గుర్తించారు. రోడ్డు పక్కన నిల్చున్న ఆటో పక్కకు తీసుకెళ్లి అఘాయిత్యం చేయబోయాడు. 

పాప గట్టిగా కేకలు వేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న బస్తీ వాసులు అతన్ని గమనించారు. బస్తీ వాసుల్ని చూసి నిందితుడు పారిపోయే ప్రయత్నం చేశాడు. కానీ బస్తీ వాసులు నిందితుడిని పట్టుకుని స్థానికులు దేహశుద్ధి చేశారు. నిందితుడు మల్లికార్జున్ మీద 366,354, 352A, పోక్సో ఆక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేట జేపీ నగర్ లో చిన్న కారణానికే ఓ మహిళను భర్త హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా దర్పల్లికి చెందిన మానస(24) తో జగద్గిరిగుట్టకు చెందిన గంగాధర్(32) కు గతేడాది నవంబర్ 20న వివాహం జరిగింది. కొద్ది నెలలకే వీరి ఇద్దరి మధ్య కలహాలు చోటుచేసుకోవడంతో మూడు నెలల కిందట మానస పుట్టింటికి వెళ్లిపోయింది.

శారీరకంగా వాడుకుని వదిలేసాడు...: ప్రియుడి ఇంటిముంది యువతి ఆందోళన (వీడియో)

గంగాధర్ మూసాపేటలోని జేపీ నగర్ లో ఉంటున్నాడు. 10 రోజుల క్రితం గంగాధర్ తండ్రి మరణించడంతో మానస జగద్గిరిగుట్టలోని అత్తారింటికి వచ్చింది. ఆదివారం తన భార్య మానసను గంగాధర్ మూసాపేటలో తానుంటున్న ఇంటికి తీసుకువచ్చాడు. 

సాయంత్రం ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. తాను అబార్షన్ చేయించుకున్నాని భర్తకు చెప్పడంతో.. అతను కోపంతో ఊగిపోయాడు. వెంటనే గొంతు నులిమి చంపేసి అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.