కుమార్తెపై అల్లుడి దాడి.. అడ్డు వెళ్లిన అత్త దారుణహత్య

First Published 15, May 2019, 9:26 AM IST
man attacks on his aunty and wife
Highlights

భూపాల్‌పల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామంలో అత్తను అల్లుడు దారుణంగా హత్య చేశాడు.

భూపాల్‌పల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేగొండ మండలం చెన్నాపూర్ గ్రామంలో అత్తను అల్లుడు దారుణంగా హత్య చేశాడు. తల్లీకూతుళ్లపై అల్లుడు గొడ్డలితో దాడి చేయడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అత్త అక్కడికక్కడే దుర్మరణం పాలవ్వగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

వివరాల్లోకి వెళితే.. అల్లె ప్రభాకర్‌కు అదే గ్రామానికి చెందిన సుజాతతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అయితే మద్యానికి బానిసైన ప్రభాకర్ భార్యపై అనుమానంతో తరచు ఆమెను వేధిస్తుండేవాడు. ఈ వేధింపులు తట్టుకోలేక సుజాత పుట్టింటికి వెళ్లిపోయింది.

భార్యను బ్రతిమలాడి ఇంటికి తీసుకోద్దామని ప్రభాకర్ మంగళవారం రాత్రి అత్తారింటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఇంటికి వచ్చే విషయమై భార్య, భర్తల మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. మాట మాట పెరిగిన క్రమంలో ప్రభాకర్ భార్యపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచాడు.

కుమార్తెను కాపాడుకోవడానికి వెళ్లిన అత్త లక్ష్మీపైనా దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మరణించింది. వీరి గొడవను గమనించిన స్థానికులు సుజాతను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్ధితి విషమంగా ఉంది.

loader