హైదరాబాద్ బోయిన్ పల్లిలో విచిత్ర ఘటన జరిగింది. బావపై సొంత బావమరిది నీళ్ల బిందెతో దాడిచేశాడు. ఈ సంఘటన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ఘటన నేపథ్యం వివరాల్లోకి వెడితే.. 

హైదరాబాద్ బోయిన్ పల్లిలో విచిత్ర ఘటన జరిగింది. బావపై సొంత బావమరిది నీళ్ల బిందెతో దాడిచేశాడు. ఈ సంఘటన బోయినపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ ఘటన నేపథ్యం వివరాల్లోకి వెడితే..

2016లో మల్కాజిగిరికి చెందిన నవీన్ కుమార్ కు గౌలిగూడకు చెందిన హిమబిందుతో వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల కొడుకు ఉన్నాడు. ఈ మధ్య కాలంలో భార్యభర్తల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో గత కొంతకాలంగా కుటుంబపరమైన సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సమస్యను పరిష్కరించాలంటూ నవీన్, హిమబిందును తీసుకుని న్యూ బోయిన్ పల్లిలోని తన సోదరి సరిత ఇంటికి వచ్చాడు. బంధువులందరూ కలిసి హిమబిందుకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోకుండా ఆమె అక్కడినుంచి వెళ్లిపోయింది.

ఆ తరువాత నవీన్ బావమరుదులిద్దరూ వీరేందర్, శ్రీకాంత్ లు సరిత ఇంటికి వచ్చారు. నవీన్ ను తిడుతూ గొడవకు దిగారు. దీంతో ఆగని వీరేందర్ కోపంతో రగిలిపోతూ అక్కడే ఉన్న బిందెతో నవీన్ పై దాడి చేశాడు.

ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన నవీన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీని మీద శుక్రవారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రవికుమార్‌ తెలిపారు.