Asianet News TeluguAsianet News Telugu

అత్తను గొంతునులిమి చంపిన అల్లుడు.. కరోనా టీకా వల్లే చనిపోయిందంటూ నాటకం.. చివరికి..

అత్త నిత్యం తిడుతుందని ఆగ్రహించిన అల్లుడు…  అత్తను హత్య చేశాడు ఆ తరువాత టీకా వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురై మరణించిందని బంధువులను నమ్మించాడు.  అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా ఒంటిమీద గాయాలు కనిపించడంతో గ్రామస్తులు నిలదీయగా.. నిజం  ఒప్పుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి మండలం నాగపూర్ లో చోటుచేసుకుంది.

 

man assassinated mother-in-law in sangareddy
Author
Hyderabad, First Published Jan 13, 2022, 7:11 AM IST

సంగారెడ్డి : sangareddyలో దారుణం జరిగింది. ఇల్లరికం వచ్చిన ఓ అల్లుడు ఏకంగా mother-in-lawనే గొంతునులిమి చంపేశాడు. ఆ తరువాత corona vaccine వేసుకోవడం వల్ల వికటించి మరణించిందని నాటకం ఆడాడు. అయితే గ్రామస్తులకు అనుమానం రావడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. 

అత్త నిత్యం తిడుతుందని ఆగ్రహించిన అల్లుడు…  అత్తను హత్య చేశాడు ఆ తరువాత టీకా వేసుకోవడం వల్లే అస్వస్థతకు గురై మరణించిందని బంధువులను నమ్మించాడు.  అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా ఒంటిమీద గాయాలు కనిపించడంతో గ్రామస్తులు నిలదీయగా.. నిజం  ఒప్పుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి మండలం నాగపూర్ లో చోటుచేసుకుంది.

 గ్రామీణ  సిఐ ఎస్. శివలింగం తెలిపిన వివరాల ప్రకారం..  నాగపూర్ కు చెందిన కటకం బాలమ్మ (65) కుమారులు లేరు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వారికి వివాహాలు జరిగాయి. పెద్ద కూతురు లక్ష్మి భర్త బాగయ్యను ఇల్లరికం తెచ్చుకుంది.  బాగయ్యది పుల్కల్ మండలం మంతూరు. బాగయ్య మూడు రోజుల క్రితం భార్య, పిల్లలను మంతూర్ లో వదిలిపెట్టి వచ్చాడు.

పొదుపు సంఘం డబ్బులు చెల్లించాలని చెప్పి  నాగపూర్ వచ్చాడు. ఏ పని చేయకుండా  జులాయిగా  తిరుగుతున్నావని బాగయ్యను  అత్త బాలమ్మ  మంగళవారం రాత్రి బాగా తిట్టింది. దీంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఆగ్రహించిన భాగయ్య అతని గొంతు నులిమి హత్య చేశాడు.  ఆ తరువాత ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే అత్త ఇటీవల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న విషయం గుర్తుకువచ్చింది. దాంతో కొత్త నాటకం అల్లాడు. కరోనా టీకా తీసుకోవడం వల్ల అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయిందని బుధవారం అందరినీ నమ్మించాడు.

తన భార్య, బంధువులకు సమాచారం ఇచ్చాడు. అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా  గొంతు, ఒంటిపై గాయాలున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. బాగయ్యను అనుమానించి.. ఓ గదిలో బంధించి  గట్టిగా నిలదీశారు. దీంతో అతను నేరం చేసినట్లు ఒప్పుకున్నాడు.  గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆయనను అదుపులోకి తీసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని వివరించారు. 

ఇదిలా ఉండగా, తాగుడుకు బానిసైన ఓ వ్యక్తి mother-in-law మీద కత్తితో దాడి చేసి Ear కోసేశాడు. అడ్డు వచ్చిన wifeనూ గాయపరిచాడు. ఈ ఘటన మంగళవారం Adoniలో చోటు చేసుకుంది. వన్ టౌన్ సీఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని మరాఠాగేరికి చెందిన మాధవి.. నిజాముద్దీన్ కాలనీకి చెందిన నరేష్ కుమార్ ఎనిమిది నెలల క్రితం ప్రేమించి marriage చేసుకున్నారు. 

కొద్దికాలం తర్వాత నిత్యం తాగి వచ్చి భర్త డబ్బు కోసం ఆమెను వేధించేవాడు. ఇది భరించలేక ఇటీవలే మాధవి తన భర్తను వదిలి తల్లి సావిత్రమ్మ వద్దకు వెళ్లింది. భార్య పుట్టింటికి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడు. దీంతో కోపంతో నరేష్ కుమార్ అత్త ఇంటికెళ్లాడు. కోపంతో ఊగిపోతూ knifeతో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సావిత్రమ్మ ఎడమ చెవి సగం తెగిపోయింది.

అడ్డు వచ్చిన భార్య మీద మీద కూడా దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఏడుపు విని ఇరుగుపొరుగు వారు రావడంతో నరేష్ కుమార్ అక్కడినుంచి తప్పించుకుని పరారయ్యాడు. జరిగిన ఘటన మీద మాధవి ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios