తన భార్యతో సన్నిహితంగా మెలుగుతున్నాడన్న అనుమానంతో సొంత తమ్ముడినే.. నమ్మించి, మద్యం తాగించి.. గొడ్డలితో నరికి చంపాడో అన్న.
ఖమ్మం జిల్లా : అన్నభార్య వదినతో సంబంధం పెట్టుకుని తమ్ముడు దిగజారిపోతే.. అతడిని గొడ్డలితో నరికి చంపి మనిషిగా మరింత దిగజారి పోయాడు అన్న. సోమవారం తెల్లవారుజామున ఖమ్మం జిల్లా వైరా మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో రెబ్బవరం గ్రామం పండగరోజు ఉలిక్కిపడింది. రెబ్బవరం గ్రామానికి చెందిన సాదం రామకృష్ణ, నరేష్ (32) అన్నదమ్ములు. రామకృష్ణ కూలీ పనులు చేస్తుండగా దివ్యాంగుడు నరేష్ వాటర్ ప్లాంట్ లో గుమాస్తాగా పని చేస్తున్నాడు. వీరిద్దరూ తల్లి సుబ్బమ్మతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు.
రామకృష్ణ మొదటి భార్యతో మనస్పర్థలు వచ్చి విడిపోయి రెండో పెళ్లి చేసుకున్నాడు. నరేష్ భార్య రెండేళ్ల క్రితం వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో 15 రోజుల క్రితం తన భార్యతో నరేష్ సన్నిహితంగా ఉండటం చూసిన రామకృష్ణ ఆమెను మందలించాడు. దీంతో ఆమె పిల్లలను తీసుకొని రాజమండ్రిలోని పుట్టింటికి వెళ్లిపోయింది. నరేష్ తో వివాహేతర సంబంధం కారణంగానే ఆమె తనని వదిలేసి పోయిందని కక్ష పెంచుకున్న రామకృష్ణ తమ్ముడిని ఎలాగైనా హతమార్చాలని పథకం వేసుకున్నాడు.
నమ్మించి తీసుకెళ్లి..
తల్లి సుబ్బమ్మ దీపావళి పండుగకు కూతురు ఇంటికి వెళ్లగా రామకృష్ణ తన తమ్ముడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఆదివారం రాత్రి రెబ్బవరం శివార్లలోకి తీసుకెళ్లి మద్యం తాగించాడు. ఆ తర్వాత ఇద్దరూ ఇంటికి వెళ్లి భోజనం చేసి పడుకున్నారు. నిద్రలోకి జారుకున్న నరేష్ పై రామకృష్ణ గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేసి నరికేశాడు. దీంతో నరేష్ అక్కడికక్కడే మృతి చెందింది.
వనపర్తిలో పరువు హత్య: ప్రేమలో పడిందని కూతురి కాళ్లు, చేతులు కట్టేసి... కన్నతండ్రి ఘాతుకం
ఆ తరువాత ఈ విషయాన్ని మేనమామ చెరుకూరి లక్ష్మీనారాయణ, స్నేహితులకు రామకృష్ణ ఫోన్ చేసి చెప్పాడు మీరు పోలీసులకు సమాచారం అందించడంతో.. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా, తన భార్యతో సన్నిహితంగా ఉండటాన్ని చూసి తట్టుకోలేకే తమ్ముడిని హతమార్చినట్లు విచారణలో రామకృష్ణ నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
అయితే, భార్య తమ్ముడితో సన్నిహితంగా ఉండడం చూశానని బంధువులు, స్నేహితులకు చెప్పేవాడు. వారిద్దరినీ చంపుతానని బెదిరించాడు. భార్యను తీవ్రంగా కొట్టాడు. దీంతోనే భయపడిన భార్య పుట్టింటికి వెళ్లిపోగా, ఆమెను మంచిగా చూసుకుంటానని వేధించనని ఇంటికి రప్పించాల్సిందిగా పోలీసులను కూడా ఆశ్రయించాడు. అయితే.. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో పగ పెంచుకున్నాడు.
తమ్ముడిని మచ్చిక చేసుకునేందుకు ప్రయత్నించాడు. మనిద్దరం మంచిగా ఉందామని చెప్పి 3,4 రోజులుగా నరేశ్ పనిచేసే ప్లాంట్ దగ్గరికి వెళ్లి ఖర్చులకు డబ్బులు అడిగి తీసుకుంటుండేవాడు. ఈ నెల 23న కూడా అలాగే డబ్బులు తీసుకుని.. మద్యం తాగి ఇంటికి వెళ్లాడు. భయంతో కొద్ది రోజులుగా వాటర్ ప్లాంట్ లోనే పడుకుంటున్న నరేష్ ఆ రోజు తన అన్నతో కలిసి ఇంటికి వెళ్లడంతో ఈ ఘోరం జరిగింది.
బాదం రామకృష్ణ మొదటి నుంచి నేర స్వభావం అని గ్రామస్తులు తెలిపారు నరేష్ గారు నేను సైతం విజయవాడ దీంతో ఆమె రెండేళ్ల క్రితం వెళ్లిపోయిందని పోలీసులకు తెలిపారు మొదటి భార్య సైతం వేధించడంతో ఆమె వెళ్ళిపోగానే రామకృష్ణ రెండో వివాహం చేసుకున్నాడని వివరించారు ఆలయంలో విగ్రహాల చోరీ కేసులో ప్రధాన నిందితుడు. పలు ఘర్షణలు, వివాదాలకు సంబంధించి అతనిపై పలు కేసులు ఉన్నాయి
