Asianet News TeluguAsianet News Telugu

రీల్ పోలీస్, రియల్ దొంగ... సినిమా కెమెరాలు దొంగిలించి జల్సాలు.. ఆ తరువాతే...

కెమెరాలు కొనే  పరిస్థితి లేకపోవడంతో వాటిని దొంగిలించాలనుకున్నాడు.  హైదరాబాద్ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా కెమెరాలను చోరీ చేసి వాటితో దందా కొనసాగిస్తున్నాడు. 

Man arrested for stealing cameras in Hyderabad
Author
Hyderabad, First Published Aug 17, 2021, 10:20 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సినిమాల్లో, సీరియళ్లలో పోలీసు పాత్రలో నటిస్తుంటాడు. ఎంతోమంది క్రిమినల్స్ ను పట్టుకుని విచారిస్తుంటాడు. ఓ యూట్యూబ్ ఛానల్ క్రైం రిపోర్టర్గా కూడా పని చేశాడు. నిజ జీవితంలో మాత్రం రివర్స్ పాత్ర పోషిస్తున్నాడు. నటించే సమయంలో సినీ కెమెరాలకు ఉన్న డిమాండ్ ను గమనించి వాటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు.

కెమెరాలు కొనే  పరిస్థితి లేకపోవడంతో వాటిని దొంగిలించాలనుకున్నాడు.  హైదరాబాద్ తోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల్లో కూడా కెమెరాలను చోరీ చేసి వాటితో దందా కొనసాగిస్తున్నాడు. నగరంలోని పంజాగుట్ట పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన అధికారులు.. నిందితుడిని అరెస్టు చేసి అతని నుంచి పదకొండు విలువైన కెమెరాలు, లాప్ టాప్ లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

వెస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ ఏ ఆర్ శ్రీనివాస్ సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో  వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్  లోని తిరుపతికి చెందిన ప్రవీణ్ కుమార్ (32) అలియాస్ తేజ అలియాస్ కళ్యాణ్ ఇలా పేర్లు చాలా ఉన్నాయి. అతను ఆరు మొబైల్ నెంబర్లు వాడుతున్నట్లు ఇప్పటివరకు పోలీసులు గుర్తించారు. ఏడో తరగతి వరకు చదివిన ప్రవీణ్ కుమార్ వివిధ ప్రైవేట్ కంపెనీలో పని చేశాడు.  నగరానికి చేరుకుని యూసు‌ఫ్‌గూడలోని ఫోకస్ యాక్టింగ్ అకాడమీలో చేరాడు. సినిమాల్లో సీరియళ్లలో అతిధి నటుడిగా పనిచేస్తుంటాడు. 

గాంధీ ఆసుపత్రిలో అక్కాచెల్లెళ్లపై గ్యాంగ్‌రేప్: ఆచూకీ లేని మరో మహిళ, పోలీసుల అదుపులో ఏడుగురు

ఓ యూట్యూబ్ ఛానల్ లో క్రైమ్ రిపోర్టర్ గా కూడా పని చేశాడు. మద్యం, జల్సాలకు అలవాటు పడ్డ అతనికి సంపాదన సరిపడలేదు. షూటింగ్లో ఉన్నప్పుడు సినిమా కెమెరాలకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వాటిని చోరీ చేసి అద్దెకిస్తే భారీగా డబ్బు వస్తుందని భావించాడు. కెమెరాలు అద్దెకిచ్చే వారిని ఓఎల్ఎక్స్ ద్వారా గుర్తించి కాంటాక్ట్ చేసేవాడు. తన ఛానల్ ఐడి కార్డు, ఆధార్ కార్డు  జిరాక్స్ ఇచ్చి వారినుంచి అద్దెకు కెమెరా తీసుకునేవాడు. 

ఆ తర్వాత  అద్దె చెల్లించకుండా దాట వేసేవాడు. ఆ తర్వాత వారి నెంబర్ ని బ్లాక్ చేసి కాంటాక్ట్ లో లేకుండా చేస్తాడు. ప్రవీణ్ కుమార్ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు నగరంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో పదకొండు కెమెరాలు దొంగిలించాడు.  అతనిపై అల్వాల్ పిఎస్ లో గృహహింస కేసు కూడా నమోదైంది.  ప్రవీణ్ కుమార్ ను అరెస్ట్ చేసిన పోలీసులు 11  కెమెరాలను, లాప్టాప్, 2  మొబైల్ ఫోన్లు,  మూడు సిమ్కార్డులు స్వాధీనం చేసుకుని  రిమాండ్ కు తరలించారు. నిందితుడిని అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సిబ్బందిని ఏ.ఆర్ శ్రీనివాస్ అభినందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios