సోషల్ మీడియాలో మహిళలను వేధిస్తున్న వారి సంఖ్య ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యాయి. తాజాగా వాట్సాప్‌లో మహిళల అశ్లీల ఫోటోలు, అసభ్యకర సందేశాలు పంపుతూ వేధిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహిళలను వేధించిన కేసులో గతంలో జైలుకు వెళ్లొచ్చిన దుర్గాప్రసాద్ తన వైఖరిని ఇంకా మార్చుకోలేదు. మహిళకు వీడియో కాల్స్ చేస్తూ వారి నగ్న చిత్రాలను పంపాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు.

ఇందుకు నిరాకరిస్తే వారి మొబైల్ నెంబర్లను పోర్న్ సైట్లలో పోస్ట్ చేస్తానంటూ దుర్గాప్రసాద్ బెదిరిస్తున్నాడు. సోషల్ మీడియాలో చురుగ్గా వుండే మహిళలనే నిందితుడు టార్గెట్ చేస్తున్నట్లు  పోలీసులు గుర్తించారు.

ఓ మహిళా న్యాయవాదిని కూడా ఇదే తరహాలో అతను ఇదే తరహాలో వేధించడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుడి వద్ద నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు పలువురి అమ్మాయిల ఫోన్ నెంబర్లు, ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. బాధితుల్లో మహిళా లాయర్లు, డాక్టర్లు, యువతులు వున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా వుండే మహిళలు, బాలికలు జాగ్రత్తగా ఉండాలని తెలియని వారి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించొద్దని పోలీసులు సూచిస్తున్నారు.