తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమార్తె కవితలపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటకు చెందిన చిఫ్రా నరేశ్ ప్రైవేట్ ఉద్యోగి... ఇతను కేసీఆర్, కవిత ఇతర కుటుంబసభ్యులుపై ఫేస్‌బుక్‌లో అసభ్యకరంగా పోస్టులు పెట్టడంతో పాటు ఫోటోలు మార్ఫింగ్ చేస్తున్నాడు.

సీఎం ప్రతిష్టకు భంగం కలిగేలా, ఆయన కుమార్తె కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వున్న పోస్టులపై టీఆర్ఎస్ విద్యార్ధి విభాగం నేత శ్రీనివాస్ యాదవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు రెండు ఫేస్‌బుక్ ఖాతాల్లో కేసీఆర్, కవితలను గురించి అసభ్య వాఖ్యాలున్నాయని గుర్తించారు. టెక్నికల్ డేటా ఆధారంగా నిందితుడిని గుర్తించి.. మంగళవారం నరేశ్‌ను అరెస్ట్ చేశారు.