Asianet News TeluguAsianet News Telugu

పెళ్లి సంబంధాలు కుదరడం లేదని తాగుడుకు బానిసై.. చివరికి ఆత్మహత్య..

 బంజారాహిల్స్ రోడ్ నెం.7లో నివసించే ప్రవీణ్ (30) జిరాక్స్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం కావడంతో  రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి ఆదివారం పనిమీద బీహెచ్ఈఎల్ కు వెళ్లగా.. ఇంట్లోనే పడక గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

man addicted to alcohol and eventually suicide for not getting married in hyderabad
Author
Hyderabad, First Published Jan 25, 2022, 7:46 AM IST

హైదరాబాద్ : ప్రతి మనిషి జీవితంలో పెళ్లి ఒక ముఖ్యమైన మలుపు.. అయితే ఆర్థిక పరిస్థితులు, సామాజిక హోదా ఇలాంటి కారణాలతో చాలాసార్లు పెళ్లిళ్లు తప్పిపోతుంటాయి. ఆలస్యం అవుతుంటాయి... ఇదే క్రమంలోఎన్ని Marital relations చూసినా కుదరకపోవడంతో liquorకి బానిసైన ఓ యువకుడు suicideకు పాల్పడిన ఘటన Banjara Hills లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నెం.7లో నివసించే ప్రవీణ్ (30) జిరాక్స్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రం కావడంతో  రెండేళ్లుగా పెళ్లి సంబంధాలు కుదరడం లేదు. దీంతో మానసికంగా కుంగిపోయి మద్యానికి బానిసయ్యాడు. అతని తల్లి ఆదివారం పనిమీద బీహెచ్ఈఎల్ కు వెళ్లగా.. ఇంట్లోనే పడక గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

ఆమె తిరిగి వచ్చేసరికి కుమారుడు విగతజీవిగా ఉండడంతో కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది. ప్రవీణ్ కుమార్ సోదరుడు బాల్ కుమార్ బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు  నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, సోమవారం Hyderabadలో దారుణం జరిగింది. నగరంలోని పాతబస్తీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి అత్యంత ఘోరంగా suicideకు పాల్పడ్డాడు. తలాబ్ కట్టా భవానీ నగర్ లో knifeతో గొంతు కోసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్నాడా వ్యక్తి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

మృతుడు అజార్ (35)గా పోలీసులు గుర్తించారు. కొద్ది రోజులుగా ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

ఇలాంటి ఘటనే రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోనే జరిగింది.  wifeతో గొడవలు, అత్తింటివారి వేధింపులు తాళలేక ఓ వ్యక్తి suicide చేసుకున్నాడు. మీర్ పేట ఇన్స్పెక్టర్ మహేందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్ కు చెందిన శ్రీరాములు శ్రావణ్ కుమార్ (32) కుటుంబ సభ్యులతో కలిసి బడంగ్ పేట్ లోని లక్ష్మీ దుర్గ కాలనీలో స్థిరపడ్డాడు. 2019లో జనగామకు చెందిన రవళి (26)తో అతడికి marriage అయింది. వారికి రెండున్నరేళ్ల కూతురు ఉంది. కొంతకాలంగా  దంపతులు తరచూ conflicts పడుతున్నారు.

ఈ క్రమంలో గత ఏడాది ఆగస్టులో husbandతో గొడవపడి కుమార్తెను తీసుకుని  పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి శ్రావణ్ కుమార్ మానసికంగా కుంగిపోయి liquorకి బానిసయ్యాడు. అప్పుడు పెరగడంతో లక్ష్మీ దుర్గ కాలనీలోని ఇల్లు అమ్మకానికి పెట్టాడు. విషయం తెలుసుకున్న రవళి అందులో తనకు వాటా ఉందని. వాటా తేలేవరకూ ఇల్లు అమ్మకానికి పెట్టొద్దని Legal noticeలు పంపించింది.

దాంతో మనస్తాపం చెందిన శ్రావణ్ కుమార్ గురువారం రాత్రి మద్యం తాగి కాలనీలోని ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ ఎక్కి పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నం స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. తన చావుకు భార్య, అత్తింటివారే కారణమని మృతుడు సూసైడ్ నోట్ రాశాడని, అతడి తల్లి అంజమ్మ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి చెప్పారు. 

Follow Us:
Download App:
  • android
  • ios