నల్గొండ: ప్రియుడితో వివాహేూతర సంబంధం కారణంగా భర్తను భార్య హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధఇతుడి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం చిత్తలూరులో  గుండబోయిన మల్లేశం భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. మళ్లేశం భార్య మమతకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఈ కారణంగానే మల్లేశ్ మద్యానికి బానిసగా మారాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.  మద్యం మత్తులో మల్లేష్ గా ఉండగా ప్రియుడితో మమత వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

మంగళవారం రాత్రిపూట తన ఇంట్లోనే మల్లేష్ హత్యకు గురయ్యాడు. మల్లేష్ యాదవ్ తలపై , ప్రైవేట్ పార్ట్స్‌పై గాయాలు ఉన్నట్టుగా పోలీసులు చెబుతున్నారు. మల్లేష్ ను ఎవరు హత్య చేశారనే విషయమై మమత నోరు మెదపడం లేదు. మల్లేష్ యాదవ్  సోదరుడు మాత్రం  మమతపై అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. 

ఈ విషయాన్ని బాధిత కుటుంబం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.