హైదరాబాద్:కొడుకును చంపి తాను ఆత్మహత్యకు పాల్పడింది వివాహిత. ఈ ఘటన హైద్రాబాద్ ఎల్బీనగర్ లో చోటు చేసుకొంది. 

హైద్రాబాద్‌ ఎల్బీనగర్ శాతావాహన నగర్ లో నివాసం ఉంటుంది.యాదాద్రి భువనగరి జిల్లా వలిగొండ మండలం వర్కుట్‌పల్లి గ్రామానికి చెందిన మమత భర్తతో కలిసి నివాసం ఉంటుంది.

వీరికి 12 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి మూడేళ్ల క్రితం కొడుకు పుట్టాడు.  సోమవారం నాడు అర్ధరాత్రి కొడుకును రేయాన్స్ కుడిచేతిని కత్తితో కోసింది. తీవ్ర రక్తస్రావమై బాలుడు మృతి చెందాడు. బాలుడు మృతి చెందిన తర్వాత తాను అద్దెకు ఉంటున్న ఇంటలోని మూడో అంతస్తు నుండి ఆమె దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

పెళ్లైన 9 ఏళ్ల తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కొడుకుకు కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి. దీంతో ఆయనకు చికిత్స చేయించడంతో నయమైనట్టుగా ఇంటి యజమాని చెప్పారు. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు.

సోమవారం నాడు సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో కొడుకు రియాన్ష్ చేతిని కత్తితో కోసి బయటి నుండి తలుపుకు గడియ పెట్టి ఇంటి ట్యాంక్ వద్ద మమత నక్కింది. రాత్రి ఇంటికి వచ్చిన భర్త శంకరయ్య చూసి కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇంటి యజమాని సహాయంతో శంకరయ్య కొడుకును ఆసుపత్రికి తీసుకెళ్లాడు.

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రియాన్స్  మరణించాడు. అయితే ఈ విషయం తెలిసిన ఇంటి యజమాని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మరో వైపు ఈ సమాచారాన్ని మమత కుటుంబసభ్యులకు కూడ శంకరయ్య సమాచారం ఇచ్చాడు.

రియాన్స్ చనిపోయిన తర్వాత ట్యాంక్ వద్ద మమత ఉందా అనే అనుమానంతో చూసేందుకు వెళ్లిన మమత సోదరుడిని చూసి ఆమె భవనంపై నుండి దూకింది. అదే సమయంలో భవనం కిందే పోలీసులు, ఇంటి యజమాని ఉన్నారు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడే మరణించింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.